YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అస్సోం సీఎంతో ఈటెల భేటీ

అస్సోం సీఎంతో ఈటెల భేటీ

హైదరాబాద్, జూన్ 10, 
గత కొంతకాలంలో రాష్ట్ర బీజేపీలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హఠాత్తుగా గౌహతి వెళ్ళారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో ప్రత్యేకంగా భేటీ కావడం కోసమే అసోం టూర్ వెళ్ళినట్లు తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన పార్టీ వ్యవహారాలతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర పార్టీల ఎత్తుగడులు తదితరాలపై వీరి మధ్య భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ ఢిల్లీ పెద్దలు కొందరు ఇచ్చిన సూచన మేరకు గౌహతి వెళ్ళి హిమంతతో భేటీ కావాలని ఈటల నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించి ఇకపైన రూపొందించుకోవాల్సిన కార్యాచరణపై హైకమాండ్ నేతలకు చేరవేయడానికి గౌహతి టూర్‌ను వాడుకుంటున్నట్లు తెలిసింది.రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్ళిన ఈటల రాజేందర్ కొద్దిమంది సీనియర్లతో సమావేశమైన సంగతి తెలిసిందే. బీజేపీలో ఇమడలేకపోతున్నారని, నాయకత్వంతో విభేదాలు ఉన్నాయని, అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ యాక్షన్ ప్లాన్‌లో చేయనున్న మార్పులు చేర్పులు తదితరాలపై హైకమాండ్ నేతలకు ఇటీవల ఈటల వివరించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పార్టీ యూనిట్‌లో పొడసూపుతున్న పరిణామాలతో ఇబ్బంది పడుతున్నారని, పరిష్కరించుకునే ప్రయత్నంలో ఢిల్లీ నేతలతో సంప్రదింపులు జరిపినా పెద్దగా ఫలితం లేకపోయిందనే చర్చ రాష్ట్రస్థాయి నేతల్లోనే జగిగింది. పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను మార్చాలంటూ ఢిల్లీ పెద్దలకు ప్రతిపాదించినట్లు వచ్చిన వార్తలపై ఆయనే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.స్టేట్ పార్టీ చీఫ్‌గా బండి సంజయ్ యధావిధిగా కొనసాగుతారని, తాను రాష్ట్ర అధ్యక్ష పదవిని లేదా మరో బాధ్యతను ఆశించడంలేదని మీడియాకు క్లారిటీ ఇచ్చారు. కానీ పార్టీలో ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను గమనంలోకి తీసుకున్న కొద్దిమంది సీనియర్ నేతలు హిమంత బిశ్వశర్మతో షేర్ చేసుకోవాల్సిందిగా సూచించి దానికి తగిన ఏర్పాట్లు చేయడంతోనే హఠాత్తుగా శుక్రవారం ఉదయం గౌహతికి వెళ్ళారు. . ఈ నెల 15న ఖమ్మం టౌన్‌లో అమిత్ షా భారీ బహిరంగసభ ఉండడంతో అప్పటికల్లా హిమంత ద్వారా రాష్ట్ర పార్టీకి సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి వెళ్తాయన్న ఉద్దేశంతోనే ఈ సడెన్ టూర్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

Related Posts