YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జూన్ 14 నుండి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం మంత్రి హరీష్ రావు

జూన్ 14 నుండి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం మంత్రి హరీష్ రావు

హైదరాబాద్
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్  డివిజన్ 5 వ ఫేస్ లోధ టవర్స్ సమీపంలో  100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ మాధవరం కృష్ణారావు , ఎం.ఎల్.సి లు నవీన్ రావు , శంభిపూర్ రాజు , స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ రెండేళ్ల పాటు కష్ట పడి మీ ఎమ్మెల్యే ఈ ఆసుపత్రి వచ్చేలా కృషి చేశారు. 1000 పడకల టిమ్స్ ఆసుపత్రి వస్తుంది. పఠాన్ చెరు లో మరొక సూపర్ స్పెషాలిటీ వస్తుంది. ఇవి ఉన్నా కూడా మీ ఎమ్మెల్యే పట్టుబట్టి ఆసుపత్రి సాధించారు. కూకట్ పల్లిలో చెరువు బాగైంది, రైతు బజార్ బాగైంది. పి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నీళ్ళ కోసం నాడు ధర్నాలు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తెలంగాణలో లేవు. మహారాష్ట్రలో 9 రోజులకు నీళ్ళు వచ్చే ప్రాంతాలు ఉన్నాయి.  హైదరాబాద్ నీటి కష్టాలు తీర్చిండు కేసీఆర్. ఇన్వర్తర్లు లేవు, కన్వర్తర్లు లేవు, జనరేటర్లు లేవు. హైదరాబాద్ లోనే కాదు, పల్లెల్లో కూడా 24 గంటల నిరంతర కరెంట్ సీఎం ఇస్తున్నారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉంటే, మే నెలలో అవి 70 కి చేరాయి.  మన దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. కష్ట పడి పని చేస్తే ఇదంతా సాధ్యం అయ్యింది. నాడు 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ పెట్టారు. 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. వైద్య విద్య కోసం ఉక్రెయిన్, చైనా వెళ్లాల్సిన పరిస్థితి. డాక్టర్ల కొరత ఎక్కువగా ఉండే . నాడు ఎంబిబిఎస్ సీట్లు 2950 ఉంటే నేడు 8340 సీట్లు ఉన్నాయి. పక్కా తెలంగాణలో ఉండి మన బిడ్డలు డాక్టర్ కావొచ్చు. బిజెపి వాళ్ళు మేమే ఇచ్చినం మెడికల్ కాలేజీలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  ఒక్కో మెడికల్ కాలేజీ మీద తెలంగాణ 500 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఎన్ఎంసి  అటానమస్ బాడీ అనుమతి ఇస్తుంది. జుటా ప్రచారం బిజేపిది. ఇంత దారుణం ఉండదు. మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు ఉంది. 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ కు ఒక్కటి ఇవ్వలేదు. బాత్ రూం మీద బొమ్మ అడిగినోల్లు, సిలిండర్ మీద కూడా పెట్టాలని అడగాలి. జూన్ 14 నుండి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేయబోతున్నామన్నారు. ఎవరు అడగక ముందే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు.తల్లి బలంగా ఉంటే పుట్టే పుట్టబోయే బిడ్డ బాగుంటదనీ కిట్స్ ఇస్తున్నాం.తల్లి, బిడ్డకు సీఎం కేసీఆర్ కానుక ఇది. బిడ్డ కడుపులో పడితే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్. బిడ్డ పుడితే కేసీఆర్ కిట్. పుట్టుక నుండి చావు దాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించింది సీఎం కేసీఆర్. ఢిల్లీలో అవార్డులు ఇస్తారు, గల్లీలో తిడుతరు. ప్రజలు ఆలోచించాలి. పని చేసే వారిని ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు.

Related Posts