YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీ కాంగ్రెస్ లో సీట్ల లొల్లి...

టీ కాంగ్రెస్ లో సీట్ల లొల్లి...

హైదరాబాద్, జూన్ 12, 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ…కాంగ్రెస్‌లో టికెట్లు హడావుడి మొదలైంది. ఆశావహులు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. అగ్ర నాయకుల వద్ద అటెండెన్స్ కూడా వేసుకుంటున్నారు. అయితే పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్లు ఇవ్వాలన్న చర్చను…సీనియర్ నేతలు తెర మీదికి తీసుకొచ్చారట. గడిచిన 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన జిల్లా అధ్యక్షులకు టికెట్లు ఇస్తారా..? లేదా ? అనే ప్రశ్నలు వస్తున్నాయ్. పార్టీ కోసం పని చేయండి… టికెట్లు ఇస్తామని చెప్తున్నా… పూర్తి స్థాయిలో డిసిసిలకు టికెట్లు ఇచ్చే అవకాశాలు కనిపించట్లేదు. చాలా మంది డిసిసిలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. డీసీసీలకు టికెట్లు ఇచ్చే అంశంపై…పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతూ…గతంలో పోటీ చేసిన వాళ్లు ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి టికెట్లు ఇవ్వడం అంత ఈజీ కాదట. 35 మంది డిసిసి అధ్యక్షుల్లో…28 మందికి టికెట్లు వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.జిల్లా అధ్యక్షులు నలుగురైదుగురు చాలా సీరియస్‌గా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నాయిని రాజేందర్.. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం కోసం చాలా రోజులుగా పనిచేస్తున్నారు. 2018 ఎన్నికల్లోనే టికెట్ కోసం ప్రయత్నించారు. పొత్తులో భాగంగా నాయనికి టికెట్ రాలేదు. దీంతో ఈసారైనా టికెట్ వస్తుందని ఆశతో వర్కౌట్ చేసుకుంటున్నారు. మరో డిసిసి అధ్యక్షురాలు సురేఖ.. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు భార్య…మంచిర్యాల నియోజకవర్గం సీటును ఆశిస్తున్నారు. మేడ్చల్ డీసీసీ నందికంటి శ్రీధర్, వికారాబాద్ అధ్యక్షుడు పరిగి రామ్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారట. మాజీ ఎమ్మెల్యే కోటాలో ఆయనకు టికెట్‌కు ఇబ్బంది లేదటసికింద్రాబాద్ డీసీసీ అనిల్…ముషీరాబాద్‌లో 2018 ఎన్నికల్లో పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి..అంజన్‌కుమార్‌ యాదవ్‌ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఖైరతాబాద్ డీసీసీ రోహిన్ రెడ్డి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. 2018లో టికెట్ ఆఖరి నిమిషంలో చేజారింది. ఈ సారి టికెట్ తనదేనని ప్రచారం చేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డికి సన్నిహితుడనే పేరుంది. సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డి కూడా గజ్వేల్ సీటు తనదేనంటున్నారు. డీసీసీ అయినప్పటి నుంచి నియోజకవర్గంలో కనపడటం లేదని ప్రత్యర్థులు పార్టీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మెదక్ డీసీసీ తిరుపతి రెడ్డి ఇటీవలే పీసీసీని కలిశారు. భద్రాచలం డీసీసీ, ఎమ్మెల్యే పొడెం వీరయ్య సిట్టింగ్ కాబట్టి డోకా లేదు. భువనగిరి అధ్యక్షుడు అనిల్‌కు పార్టీ హామీ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో డిసిసి అధ్యక్షులకు టికెట్లు వస్తాయా ? అధ్యక్షులకు టికెట్లు ఇవ్వాలనుకుంటే…దేన్ని పరిగణలోకి తీసుకుంటారన్న చర్చ జోరుగా సాగుతోంది. కొత్తగా పోటీ చేయాలనుకునే వారికి మాత్రం టికెట్ అంత ఈజీ కాదని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి..

Related Posts