టెక్కలి
వారాహి యాత్రను ఎవరు ఆపలేరని జనసేన టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ కణితి కిరణ్ అన్నారు. ఈ సదర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 14 నుంచి చేపట్టబోయే వారాహి యాత్రలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజల వద్ద నుంచి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపతయాన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు లేని రైతు రాజ్యం స్థాపించడానికి, భవన కార్మికులకు భరోసా కల్పించడానికి జనసేన ఉపయోగపడుతుందన్నారు. నిరుద్యోగులకు వడ్డీ లేని రుణాలను అందించి వారి ద్వారా నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తామని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గా చేయడానికి జనసైనికులు ముందుకు రావాలన్నారు.