YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఢిల్లీలో రమణ దీక్షితులు దీక్ష

ఢిల్లీలో రమణ దీక్షితులు దీక్ష

తిరుమల వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయి కి చేరుకుంటోంది. స్వామివారి ఆభరణాలు మాయమైన వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండు చేస్తూ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు హస్తిన వేదికగా నిరాహార దీక్షకు దిగబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రమణ దీక్షితులు.. అక్కడే బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యం స్వామితో చర్చలు జరుపుతున్నారు. నిజానికి అసలు సుబ్రమణ్యం స్వామి సూచనల మేరకే రమణ దీక్షి తులు ఢిల్లీలో దీక్షకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీటీడీ కేంద్రంగా జరిగాయంటున్న అక్రమాలపై సీబీఐ విచారణకు ఇప్పటికే సుబ్రమణ్యం స్వామి డిమాండు చేయడంతో పాటు.. న్యాయపోరాటానికి కూడా ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు అంశాలపై సుబ్రమణ్యం స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఆభరణాలు మాయవైునట్లు చేసిన ఆరోపణలను ప్రభుత్వం కొట్టి పారేయడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. సీబీఐ విచారణ జరిపితే నిజానిజాలు తెలుస్తాయని ఆయన అంటున్నారు.  ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులను బలవంతంగా ప్రధానార్చక పదవి నుంచి తొలగించడం ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని చెబుతున్నారు. మరోవైపు టీటీడీలోని కొంత మంది ఉద్యోగులు రమణ దీక్షితులుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.  రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు  ఉద్యోగ సంఘాలలో కొంతమంది విడిపోయి, రమణ దీక్షితులు వైఖరి పట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం తిరుమలలో కొంతమంది ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నల్లబ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేయడం శ్రీవారి ఆలయంలో చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. వీరితోపాటు కొన్ని ఉద్యోగ సంఘాలు గురువారం టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం పది గంటల నుంచి గంట సేపు విధులను బహిష్కరించి, ఆందోళన చేపట్టారు. రమణ దీక్షితులు శ్రీవారి ఆలయాన్ని, పవిత్రతను మంట గలుపుతున్నారని ఈ సంఘాలు మండిపడ్డాయి. 

Related Posts