YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎర్రచందనం స్మగ్లింగ్ లో కమెడియన్ హరి

ఎర్రచందనం స్మగ్లింగ్ లో కమెడియన్ హరి

తిరుపతి, జూన్ 13,
జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా కనిపించే హరి అనే వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు. చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ.60 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ తరలింపు వ్యవహారంతో హరికి సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న జబర్దస్ హరి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇతనిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనంను విదేశాలకు అక్రమంగా తరలించి కొందరు కోట్లు గడిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతున్నా ఎర్రచందనం స్మగ్లర్స్ మాత్రం సరికొత్త ప్రణాళికతో విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఎర్రచందనం అక్రమ రవాణాలో జబర్దస్త్ కామెడియన్ హరి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కమెడియన్ హరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలు జబర్దస్త్  హరి ఎర్రచందనంను ఎక్కడికి తరలించేవాడో పోలీసులు తెలిపారు.పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం..  పుంగనూరు పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు పుంగనూరు శివారు ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఐతే పోలీసులను చూసి రెండు వాహనాలు తప్పించుకునేందుకు ప్రయత్నం చేయగా, గమనించిన పోలీసులు ఆ రెండు వాహనాలను అడ్డగించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ఓ వాహనం డ్రైవర్ పోలీసుల కన్ను కప్పి పరార్ కాగా, మరో వాహనం డ్రైవర్ కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలను తనిఖి చేయగా దాదాపు అరవై లక్షల విలువ గల పంతొమ్మిది ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలను సీజ్ చేశారు.పోలీసుల అదుపులో ఉన్న కిషోర్ ను విచారించగా ఎర్రచందనం అక్రమంగా భాకరాపేట అటవీ ప్రాంతంలో సేకరించి అక్కడి‌ నుండి కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు సమీపంలోని కటిగనహళ్ళి గ్రామంకు తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో జబర్దస్త్ ఆర్టిస్ట్ హరి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐతే పోలీసులు పరార్ ఐనా ఎర్రచందనం స్మగ్లర్, ప్రధాన సూత్రధారి జబర్దస్త్ కమెడియన్ హరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జబర్దస్త్ కమెడియన్ హరిపై తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసుల వద్ద రెండు కేసుల్లో నిందుతుడిగా ఉండగా, కాణిపాకం పోలీసు స్టేషను పరిధిలో ఒక్క‌ కేసు, ఏర్పేడు పోలీసు స్టేషను పరిధిలో ఒక్క కేసులో నిందుతుడిగా ఉన్నట్లు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.గతంలో కూడా హరి పేరు స్మగ్లింగ్ విషయంలో తెరపైకి వచ్చింది. 2021 మే నెలలో చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని చీకిమానుకోన అటవీప్రాంతంలో రెడ్‌ శాండల్‌ స్మగ్లింగ్‌ అవుతుందన్న సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది దాడులకు దిగారు. ఎనిమిది మంది స్మగ్లర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో జబర్దస్త్‌ హరి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. హరికి పలువురు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పట్లో చీకిమానుకోన అటవీప్రాంతంలో పట్టుబడ్డ స్మగ్లర్ల నుంచి రెండు నాటు తుపాకులతో పాటు మూడు లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్‌ చేశారు.

Related Posts