YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి నుంచి పోటీకి దిగుతున్న సప్తగిరి..?

తిరుపతి నుంచి  పోటీకి దిగుతున్న సప్తగిరి..?

విజయవాడ, జూన్ 13, 
ప్రముఖ సినీనటుడు, స్టార్ కమెడియన్ సప్తగిరి కీలక ప్రకటన చేశారు. సినీ ఇండస్ట్రీలో సక్సస్ అయిన సప్తగిరి ఇక రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.. చిత్తూరు‌ లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సప్తగిరి ప్రకటించారు. చిత్తూరు జిల్లాకు చెందిన తాను ఐరాల ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించినట్లు వెల్లడించారు. బంగారుపాళ్యం, పుంగనూరులో తన విద్యాభ్యాసం జరిగిందని గుర్తు చేశారు. తాను నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించారు. పేదల కష్టాలు తనకు తెలుసునని.. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుని తన వంతు సేవ చేస్తానని సప్తగిరి ప్రకటించారు. ఇప్పటికే తనను టీడీపీలో చేరాలంటూ ఆఫర్లు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. మరో 10,15 రోజుల్లో రాజకీయ ఆరంగేట్రంపై క్లారిటీ ఇస్తానని నటుడు సప్తగిరి వెల్లడించారు.తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లు ఏది ఆశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నటుడు సప్తగిరి తెలిపారు. టీడీపీ అధికారంలో రావడానికి తన వంతు కృషి చేస్తానని పార్టీ ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటానని వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు డెవలప్‌మెంట్‌ను అందరూ చూశారని.. ప్రస్తుతం చంద్రబాబు అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరం అని చెప్పుకొచ్చారు. నిజాయితీతో సినిమా రంగంలో అవకాశాలను దక్కించుకోగలిగానని... అలాగే రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పుకొచ్చారు. సినిమా వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అంతేకాదు సినిమాల్లో నటించడం వల్లే రాజకీయంగా అవకాశాలు వచ్చాయి అని నటుడు సప్తగిరి తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలను వదిలేది లేదని సప్తగిరి తెలిపారు.ఇకపోతే సప్తగిరి కమెడియన్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. బొమ్మరిల్లు, పరుగు, కందిరీగ, దరువు, గబ్బర్ సింగ్, జులాయి, ప్రేమ కథా చిత్రమ్, లవర్స్, రాజు గారి గది, ఎక్స్ ప్రెస్ రాజా, క్రాక్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాల్లో నటించారు. అలాగే సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ సినిమాల్లో హీరోగానూ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.

Related Posts