YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయనగరంలో కాల్ మనీ కలకలం

విజయనగరంలో కాల్ మనీ కలకలం

విజయనగరం, జూన్ 13, 
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన కాల్ మనీ కేసులు మరోసారి తెరమీదకు వచ్చాయి. గతంలో విజయవాడలో కలకలం రేపిన ఈ కేసులు ఇప్పుడు మాత్రం విజయనగరంలో తాజాగా బయట పడ్డాయి. విజయనగరం జిల్లాలోని జామి మండల కేంద్రానికి చెందిన చుక్కా వెంకట రావు అలియాస్ బస్సన్న తమను వేధిస్తున్నాడంటూ జిల్లా ఎస్పీ స్పందనలో చుక్కా మహాలక్ష్మి, పొట్నూరు భవాని అనే ఇద్దరు మహిళా బాధితులు ఫిర్యాదు చేశారు. జామి మండల కేంద్రంలో చుక్కా వెంకట్రావు చిట్టీల నిర్వహించే వాడని ఈ క్రమంలో తమ నుంచి అక్రమంగా లక్షలకు లక్షల వసూలు చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అతన్ని చిట్టీల డబ్బులు తిరిగి ఇమ్మంటే ఇంకా వడ్డీ కట్టాల్సి ఉందని, అది కట్టలేని పక్షంలో తమను పడుకోమని వేధిస్తున్నాడని, తమను కులం పేరుతో బూతులు తిడుతున్నారు అని స్పందనలో ఫిర్యాదు చేశారు.చుక్కా వెంకట్రావు వద్ద 14 లక్షల రూపాయలకు 3 చిట్టీలు కట్టామని, ప్రతీ నెలా చిట్టీల కోసం కట్టాల్సిన డబ్బులు లేటయిపోయిందని చుక్కా వెంకట్రావు ఫెనాల్టీలు వేసి వసూలు చేసేవాడని పేర్కొన్నారు. అలా ఫెనాల్టీల రూపంలో మరో 6 లక్షలు, వడ్డీల రూపంలో మరో 9 లక్షలు చుక్కా వెంకట్రావు కట్టించుకున్నట్టు పేర్కొన్నారు. అలా 14 లక్షల చిట్టీల కోసం పొట్నూరు భవాని నుండి ఇప్పటివరకు 29 లక్షలు వెంకట్రావు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరో 6 లక్షలు కట్టాల్సి ఉందని, లేని పక్షంలో తనతో పడుకోవాంటూ వేధిస్తున్నాడని పొట్నూరు భవాని అనే మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మరోపక్క చుక్కా మహాలక్ష్మి వెంకట్రావు వద్ద లక్షా 70 వేల రూపాయలు అప్పు తీసుకుని, 3 లక్షల రూపాయల చొప్పున మూడు చిట్టీలు కట్టింది.తీసుకున్న అప్పు, దాని వడ్డీలు, చిట్టీలకు ఫెనాల్టీలు, వడ్డీలు కలిపి నుండి ఇప్పటి వరకు చుక్కా మహాలక్ష్మి నుంచి 18 నుంచి 20 లక్షలు వసూలు చేశాడట చుక్కా వెంకట్రావు. ఇవి కాక తనఖా కింద ఇంటి డాక్యుమెంట్ లు, బంగారు నగలు వసూలు చేసిన చుక్కా వెంకట్రావు డబ్బులు కట్టిన వివరాలు పొందుపరిచే జమా పుస్తకాలు చించేసినట్టు సదరు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. దుబాయ్ వెళ్లక ముందు తమ వద్ద నుంచి ఖాళీ స్టాంప్ పేపర్లు, ప్రాంసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. దుబాయ్ లో రెండేళ్ల పాటు పని చేసి సంపాదించిన మొత్తం డబ్బులు వెంకట్రావుకే కట్టామని, ఇప్పుడు తిరిగి చెల్లించమని అడిగితే తమను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. తామే కాదు అనేకమంది వెంకట్రావు బాధితులు సూసైడ్ లు చేసుకున్నారని, తమను ఆదుకోవాలని.. లేదా తమకు ఆత్మహత్యలే గతి అని అంటూ బాధితులు వాపోయారు.
 

Related Posts