YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అమిత్ షాను కలవనున్న రాజమౌళి - టాపిక్ రాజకీయమేనా ?

అమిత్ షాను కలవనున్న రాజమౌళి - టాపిక్ రాజకీయమేనా ?

హైదరాబాద్, జూన్ 14, 
తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కలవనున్నారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను  బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. అదే సమయంలో ఆయన రజాకార్ ఫైల్స్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ గెలుచుకున్న సందర్భంగా.. అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఓ స్టార్ హోటల్‌లో విందు ఇచ్చేలా షెడ్యూల్ ఖరారైంది. కానీ  తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఆ విందు  భేటీ రద్దయింది. ఈ సారి రాజమౌళి ఒక్కరే అమిత్ షాతో  భేటీ అయ్యే అయ్యే అవకాశం ఉంది. అమిత్ షా ఏ రాష్ట్రానికి వెళ్లిన సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో కొంత మంది ప్రముఖుల్నికలిసి బీజేపీకి మద్దతివ్వాలని కోరుతారు. అందులో భాగంగానే రాజమౌళితో సమావేశం కానున్నట్లుగా చెబుతున్నారు.  ప్రధాని మోడీ 9ఏళ్లలో చేసిన అభివృద్ధిని మహాజన సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా  ఈ నెల 15న ఖమ్మంలో బీజేపీ అగ్రనేత అమిత్‌ షా బహిరంగసభ నిర్వహించనున్నారు.  ఆయన పర్యటన  షెడ్యూల్‌ను తెలంగాణ బీజేపీ   విడుదల చేసింది.  ఈ నెల 15న భద్రాచలంలో రాములవారి దర్శనంతో అమిత్‌ షా తన తెలంగాణ పర్యటనను ప్రారంభిస్తారు.      ముందుకు ఈ నెల 15న ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు అల్పాహార సమావేశంలో భాగంగా బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలతో పలు అంశాలను చర్చిస్తారు. మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి భద్రాచలానికి బయల్దేరి వెళతారు. ద్రాచలం చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.20 మధ్యలో రామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.    బహిరంగసభ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు తిరిగి శంషాబాద్‌కు వచ్చి రాత్రి 7 గంటలకు పలువురు నేతలతో వేర్వేరుగా సమావేశమవుతారు. ఈ సమయంలోనే రాజమౌళితో పాటు మరికొంత మంది ప్రముఖులతో సమావేశాలు ఉంటాయని చెబుతున్నారు. తిరిగి రాత్రి 9.40 గంటలకు శంషాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లికి బయల్దేరి వెళతారు.  
బలం లేదన్న చోటే బలనిరూపణకు వ్యూహం..
ఖమ్మం గుమ్మంలో నిర్వహించే సభపై బీజేపీ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఈ సభ టర్నింగ్ పాయింట్‌గా ఉండాలని లెక్కలేసుకుంటోంది. జిల్లాలో పార్టీ ఉనికి లేదు.. కనీస స్థాయిలోనైనా కార్యకర్తలు లేరన్న విమర్శలకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. ఎక్కడైతే ఆదరణ లేదన్న ఆరోపణలు ఉన్నాయో..ఖమ్మం గుమ్మంలో నిర్వహించే సభపై బీజేపీ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఈ సభ టర్నింగ్ పాయింట్‌గా ఉండాలని లెక్కలేసుకుంటోంది. జిల్లాలో పార్టీ ఉనికి లేదు.. కనీస స్థాయిలోనైనా కార్యకర్తలు లేరన్న విమర్శలకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. ఎక్కడైతే ఆదరణ లేదన్న ఆరోపణలు ఉన్నాయో.. అక్కడే లక్షమందితో సభ నిర్వహించి కమలం తడాఖా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సభతో మొదలుపెట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం కావాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది.బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రతో పార్టీకి మంచి మైలేజ్‌ వచ్చింది. కాంగ్రెస్‌తో పోలిస్తే గ్రాఫ్ పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత నిరుద్యోగుల తరఫున నిరసనలు, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఆందోళనతో నేతలు జనం బాటపట్టారు. అంతా బాగానే ఉందనుకున్న టైమ్‌లో.. కర్నాటకలో ఎన్నికలతో నేతలంతా అక్కడ మకాం వేశారు. దీంతో తెలంగాణలో యాక్టివిటీ తగ్గింది. అదే సమయంలో అక్కడ బీజేపీ పరాజయంతో.. ఇక్కడ పార్టీ కార్యకలాపాలు ఒక్కసారిగా అగిపోయాయి.నిజానికి కర్నాటక రిజల్ట్‌తో పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. దీనికి తోడు రాష్ట్ర నాయకత్వంలో విభేదాలు తెరపైకి వస్తున్నాయి. అంతేకాకుండా అధ్యక్షుడ్ని మారుస్తారన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. వీటన్నింటికి ఖమ్మం సభతో చెక్ పెట్టాలని అగ్రనాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో అగ్రనేతల పర్యటనలు వరుసగా ఉండేలా ప్లాన్ చేసినట్టు స్పష్టమవుతోంది.

Related Posts