YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం... కొట్లాటలు

క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం... కొట్లాటలు

నిజామాబాద్, జూన్ 14, 
మండుటెండల్లో పిల్లల కుల, ఆదాయ, స్థానిక ధ్రువ పత్రాల కొరకు రెవెన్యూ కార్యాలయాలలో ‌పిల్లలు ఉదయం పది గంటల నుంచి బారులు తీరి అధికారుల కొరకు ఎదురు చూసినా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా రాకుంటే ఎలాగా..? 3, 4, రోజులైనా సర్టిఫికెట్లు పరిశీలన చేసి ఇవ్వడం లేదు. మీసేవ లో మరో ఇబ్బంది. మరో దిక్కు పోలీసుల నియామకం వారికి సంబంధించిన ధ్రువపత్రాలు ఇవ్వాలి. అధికారులు ఎమ్మార్వో లు వారి కింది స్థాయి ఉద్యోగులు ఏం చేస్తున్నట్లు? వారిని ఎవరు అడగాలి? ఈ విషయంపై కలెక్టర్లు స్పందించక పోతే రక రకాల గొడవలు జరుగుతాయి. వీరికి మూమెంట్ రిజిస్టర్ లేదా ఎవరు రోజుకు ఎన్ని ఫైల్స్ డిస్పోజ్ చేశారని అడిగేవారు లేరా? అధికారులు ఆఫీస్లలో ఉండి కూడా పని చేయక పోతే ఎవరిది పొరపాటు? పని చేయక పోతే అడిగే హక్కు అధికారం ప్రజలకు ఉంది సిబ్బంది పని చేయకపోతే చర్య తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉంది, తాత్కాలిక అదనపు సిబ్బందినైనా ఏర్పాట్లు చేసి ఆ కొరత, పబ్లిక్ అవసరాలు తీర్చే ఏర్పాటు చేయాలినిన్నటి వరకు పరీక్షలు, ఈవెంట్స్ అంటూ కుస్తీ పట్టిన పొలీస్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు మరో సమస్య వచ్చిపడింది. కష్టపడి చదివి క్వాలిఫై అయిన సంతోషం కొంచెం కూడా లేకుండా చేస్తోంది. క్వాలిఫై అవ్వడం వరకు ఒక ఎత్తయితే.. కొలువులో చేరేందుకు చివరి దశ అయిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ మరో ఎత్తుగా మారింది. సర్టిఫికెట్ల కోసం నానా తిప్పలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు డబ్బులిస్తే కానీ సర్టిఫికెట్లు ఇచ్చేదిలేదని తెగేసి చెబుతున్నాయి. దీంతో క్వాలిఫై అయిన అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. ఇంత వరకు వచ్చాక ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందేనా అని డైలమాలో పడ్డారు. కొందరూ చేసేదేమి లేక తెలిసిన వారి దగ్గర అప్పులు చేసీ మరీ డబ్బులు కట్టడానికి సిద్దమయ్యారు. మరి కొందరు కాలేజీల యాజమాన్యాలను వేడుకుంటున్నారు.పోలీసు నియామకాల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ రేపటి నుంచి జరుగుతుండడంతో ఈ అభ్యర్థులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డారు. ముఖ్యంగా కానిస్టేబుల్ క్వాలిఫై అభ్యర్థులు డిగ్రీ, ఫార్మసీ, బీటెక్ చేస్తున్నారు. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు అని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఎస్సై క్వాలిఫై అభ్యర్థుల సమస్య మరో విధంగా ఉన్నది. వారివి డిగ్రీలు అయిపోయాయి. వారు కాలేజీల్లో చెల్లించాల్సిన పెండింగ్ ఫీజులు అలాగే ఉండటంతో సర్టిఫికెట్లు అభ్యర్థులకు ఇవ్వడం లేదు. నియామకాల్లో వెరిఫికేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి తర్వాత వాటిని కాలేజీకి అప్పగిస్తామని అభ్యర్థులు యాజమాన్యాలను వేడుకుంటున్నారు. అయిన కూడా యాజమాన్యాలు విద్యార్థుల విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా నివాస ధృవీకరణ పత్రం కోసం సైతం రెవెన్యూ అధికారులు పోలీస్ క్వాలిఫై అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. దరఖాస్తులు అందించడంలో జాప్యం చేస్తున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ దగ్గర పడుతుండడంతో సమయానికి వివిధ జిల్లాల్లోని రెవెన్యూ అధికారులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అభ్యర్థులు వారి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కేంద్రంలోనే అప్లికేషన్‌ ఎడిటింగ్‌/మాడిఫై చేసుకునే అభ్యర్థులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ద్వారా మార్కుల వెయిటేజీ పొందాలనుకుంటున్న అభ్యర్థులు ఆర్టీఏ ధ్రువీకరించిన సర్టిఫికెట్లను చూపించాలి. వెరిఫికేషన్‌కు వచ్చే అభ్యర్థులు కుల ధ్రువీకరణ, బీసీ అభ్యర్థులు నాన్‌ క్రీమిలేయర్‌, ఈడబ్ల్యూఎస్‌, ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు ఒరిజినల్స్‌, జిరాక్స్‌ల సెట్‌ తప్పనిసరిగా తీసుకొనిరావాలని అధికారులు తెలిపారు. వీటితోపాటుగా ఇంటిమేషన్‌ లెటర్‌, ట్రాన్సాక్షన్‌ ఫాం, పార్ట్‌-2 అప్లికేషన్‌ ప్రింట్‌ అవుట్‌, ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, వయసు, లోకల్‌, రిజర్వేషన్‌, ఏజ్‌ రిలాక్సేషన్‌ సర్టిఫికెట్లు, ఫోటోలు, మెమోలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, హారిజంటల్‌ రిజర్వేషన్‌ సర్టిఫికెట్లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.

Related Posts