YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎట్టకేలకు టిడ్కో ఇళ్లు...

ఎట్టకేలకు టిడ్కో ఇళ్లు...

విజయవాడ, జూన్ 15, 
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి  ఈ నెల 16న  కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు.  గుడివాడ మండలం మల్లాయపాలెం టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగే బహిరంగ సభలో  ప్రసంగిస్తారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మల్లాయపాలెం చేరుకుంటారు. అక్కడ టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.గుడివాడ సమీపంలో 300 ఎకరాల్లో 8వేల 912 ఇళ్లను నిర్మించారు. అంతేకాకుండా, నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పథకం కింద టిడ్కో కాలనీకి ఆనుకుని 6వేల 700 వ్యక్తిగత ఇళ్లు కూడా నిర్మిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27వేల 872 ఇళ్లు నిర్మాణం జరుగుతోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా AP TIDCO.. పట్టణ ప్రాంతాల్లో 27వేల 872 ఇళ్లను నిర్మిస్తోంది. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, ఉయ్యూరులో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, పేదల గృహ అవసరాలను తక్కువ ఖర్చుతో తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రూపొందించిన ఉమ్మడి వెంచర్ TIDCO గృహాలు.కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరులలో నిర్మిస్తున్న గృహ సముదాయాల వద్ద మొత్తం రూ. 139.29 కోట్లతో రహదారులు, అండర్‌ గ్రౌం డ్రైనేజీల నిర్మాణం, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు.జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరులో ఐదు సంవత్సరాల క్రితం ప్రధాన మంత్రి ఆవా్‌సయోజన (పీఎంఏవై), ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌ షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పోరేషన్‌ (ఏపీ టిడ్కో)సంయుక్త ఆధ్వర్యంలో 13,712 గృహల నిర్మాణాలను ప్రారంభించారు. 2019 నాటికి ఈ గృహసముదాయాల నిర్మాణం సగంపైనే పూర్తయింది. గృహల సముదాయాల నిర్మాణం, కాంట్రాక్టుల కేటాయింపుల్లో అకవతకలు జరిగాయనే కారణాలు చూపి రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను నిలిపివేశారు. ఏడాది క్రితం ఈ పనులను ప్రారంభించారు. గుడివాడలో 8,912 గృహాలను, మచిలీపట్నంలోని గోసంఘం, రుద్రవరం ప్రాంతాల్లో 2304 గృహాల నిర్మాణం, మౌలిక వసతుల పనులు చేశారు. అయితే రోడ్లు..ఇతర సౌకర్యాల కారణంగా గతంలో ప్రారంభోత్సవాలు వాయిదా పడ్డాయి.   గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గం కావడంతో ఆయన దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇప్పటికే నాలుగుసార్లు గుడివాడ నుంచి గెలిచిన కొడాలి నాని.. ఇక్కడి నుంచి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదోసారి గెలుపుపై కన్నేశారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల వద్దకు బాగా తీసుకెళ్తున్నారు. అభివృద్ధి పనుల్ని కూడా వేగవంతం చేసి, నియోజకవర్గంలో మరోసారి తన ముద్ర వేసి ఇక తనకు తిరుగు లేకుండా చేయాలనే యోచనలో ఉన్నారు. ముఖ్యమంత్రితో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం ఏర్పాటు ఈయనే చేయించినట్లు తెలుస్తోంది.      

Related Posts