YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీలు

తెలంగాణలో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత చెప్పినా విన్పించుకోవడం లేదు కొందరు నేతలు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వివాదం నియోజకవర్గాల్లో సద్దుమణగడం లేదు. తాజాగా రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడుతున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక నియోజకవర్గానికి కేటాయించిన నిధులు, కాంట్రాక్టుల విషయంలో కూడా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు చెబుతున్నారు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ జోక్యం ఏంటని భూపాల్ రెడ్డి బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన రైతు బంధు చెక్కుల పంపీణీ కార్యక్రమాల్లో కూడా పోటా పోటీగా సభలు పెట్టారు. ఒకే సభలో ఇద్దరూ పాల్గొనకుండా ఎవరికి తోచిన రీతిలో వారు సభలను ఏర్పాటు చేసుకున్నారు. రాములు నాయక్ 60 గ్రామాల్లో పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. అయితే కంగ్జి మండలంలో చెక్కులు పంపిణీ చేస్తుండగా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుతగిలారు. దీంతో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. టీఆర్ఎస్ లో నెలకొన్న విభేదాలు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తాయంటున్నారు. ఉప ఎన్నికల్లో కాబట్టి గెలిచారని, ఈసారి గెలవాలని రాములు నాయక్ సవాల్ విసరడం కూడా ఆసక్తి కరంగా మారిందిఅధికార పార్టీలో ఈ కుమ్ములాటలు కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటుందన్న అనుమానాన్ని క్యాడర్ వ్యక్తంచేస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఒకరిపై ఒకరు బాహాటంగా విమర్శించుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. నిన్నటి వరకూ నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే భూపాలరెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. నారాయణఖేడ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టాలనుకున్న కారు పార్టీకి విజయం సాధ్యంకాలేదు. అప్పట్లో మెదక్ జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది స్థానాలను కారు పార్టీ గెలుచుకోగా, నారాయణఖేడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణారెడ్డి, జహీరాబాద్ లో గీతారెడ్డి విజయం సాధించారు. కాని కృష్ణారెడ్డి హటాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు అక్కడే తిష్టవేసి మంత్రాంగం నడిపితేనే భూపాల్ రెడ్డి విజయం సాధ్యమైంది. ఎమ్మెల్సీ రాములు నాయక్ సొంత ప్రాంతం అదే కావడంతో ఆయన అక్కడే దృష్టి పెట్టారు. రాములు నాయక్ ది అదే నియోజకవర్గంలోని ర్యాలమడుగు గ్రామం. ఈ నియోజకవర్గంలో 45 వేలమంది గిరిజన జనాభా ఉంది. రాములు నాయక్ గిరిజన తండాల్లో పట్టు ఉండటంతోనే కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్న రాములు నాయక్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎమ్మెల్యేకు పోటీగా కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించారు. ఇది ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి మింగుడుపడలేదు.

Related Posts