కడప, జూన్ 15,
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా మర్డర్ జరిగి నాలుగేళ్లు దాటిపోయింది. మరి, ఈ నాలుగేళ్లలో సీబీఐ తేల్చిందేమిటి?. వైఎస్ వివేకా మర్డర్ ఎందుకోసం జరిగిందో? అసలు మోటివ్ ఏంటో కనిపెట్టగలిగిందా?. ఈ కేసులో అప్రూవర్ దస్తగిరి చెబుతోన్న మాటలన్నీ నిజాలేనా!. అయితే, రెండు స్టేట్‌మెంట్లలో తేడాలు ఎందుకున్నాయ్?. సిట్ రిపోర్ట్‌ను సీబీఐ ఎందుకు పట్టించుకోలేదు!. ఇవన్నీ సీబీఐ దర్యాప్తు తీరునే ప్రశ్నించేలా చేస్తున్నాయ్!. ఆధారాలతో కేసును ఛేదించాల్సిన సీబీఐ.. ఎందుకు దస్తగిరి వాంగ్మూలంపైనే ఆధారపడుతోంది?. వివేకా మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్‌లో అసలేం జరుగుతోంది? వైఎస్ వివేకా మర్డర్ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది!. నాలుగేళ్లుగా ఎంక్వైరీ చేస్తున్నా, ఇదీ అసలు జరిగింది అంటూ తేల్చిచెప్పలేకపోయింది సీబీఐ. ఒక్క మాటలో చెప్పాలంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా తయారైంది సీబీఐ ఇన్వెస్టిగేషన్ తీరు. నాలుగేళ్ల దర్యాప్తులో సీబీఐ కనిపెట్టింది ఏంటీ అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, సీబీఐ ఎంక్వైరీ మొత్తం A4 షేక్ దస్తగిరి స్టేట్‌మెంట్ చుట్టూనే సాగడం. అవును, వైఎస్ వివేకా మర్డర్ కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ అంతా అప్రూవర్ దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగానే జరిగింది.. జరుగుతోంది!.
కేసులో నిందితులుగా ఉన్నవారు
a1 – ఎర్ర గంగిరెడ్డి
a2 – సునీల్ యాదవ్
a3 – ఉమాశంకర్‌రెడ్డి
a4 – షేక్ దస్తగిరి (అప్రూవర్)
a5 – దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి
a6 – గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి
a7 – వైఎస్ భాస్కర్‌రెడ్డి
a8 – వైఎస్ అవినాష్‌రెడ్డి
అయితే, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ దస్తగిరి మొదటి వాంగ్మూలానికి.. సెకండ్ స్టేట్‌మెంట్‌కి చాలా తేడాలున్నాయ్!. ముందు చెప్పిన మాటలకీ, రెండోసారి ఇచ్చిన స్టేట్‌మెంట్‌కీ అసలు పొంతనే లేదు!. మొదటి స్టేట్‌మెంట్‌లో ఫ్రంట్ డోర్ ద్వారా వివేకా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించామని చెప్పాడు. కానీ, వాచ్‌మెన్ రంగయ్య తలుపు ముందు పడుకోవడంతో వెనుక డోర్ ద్వారా లోపలికి వెళ్లినట్టు చెప్పుకొచ్చాడు. కానీ సెకండ్ స్టేట్‌మెంట్‌లో మరోలా చెప్పాడు దస్తగిరి. అప్పటికే ఇంట్లో ఉన్న A1 ఎర్ర గంగిరెడ్డి… లోపలి నుంచి తలుపు తీశాడని వాంగ్మూలం ఇచ్చాడు. ఇక్కడే అనుమానాలు చెలరేగాయ్. దానికి మెయిన్ రీజన్, సిట్ రిపోర్ట్. సీబీఐ కంటే ముందు ఇన్వెస్టిగేషన్ చేసిన సిట్.. నిందితులు బ్యాక్ డోర్‌ను పగలగొట్టి ఇంట్లోకి వెళ్లినట్టుగా చెప్పింది. దస్తగిరి మాత్రం లోపలి నుంచి ఎర్ర గంగిరెడ్డి తలుపు తీసినట్టు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇక్కడే దస్తగిరి మాటల్లో తేడా కొట్టిచ్చినట్టు కనిపించింది. సిట్ ఏం చెప్పిందో అదే స్టేట్‌మెంట్ ఇచ్చారు వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి. తలుపులు బద్దలుకొట్టుకొని నిందితులు లోపలికి వెళ్లారని, తానే తిరిగి బాగు చేయించినట్టు చెప్పుకొచ్చారు. వీటన్నింటినీ తన నివేదికలో క్లియర్‌గా మెన్షన్ చేసింది సిట్. కానీ, సీబీఐ మాత్రం సిట్ రిపోర్ట్‌ను పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయ్. ఒకవైపు దస్తగిరి ఇచ్చిన రెండు స్టేట్‌మెంట్లలో తేడా!. ఇంకోవైపు సిట్ రిపోర్ట్‌ను పట్టించుకోకపోవడం!. మరోవైపు సునీతారెడ్డి స్టేట్‌మెంట్లలో గందరగోళం!. ఇవన్నీ సీబీఐ దర్యాప్తు తీరునే ప్రశ్నించేలా చేస్తున్నాయ్!. ఎంతసేపూ దస్తగిరి స్టేట్‌మెంట్‌పైనే ఆధారపడటంపై అనుమానాలు చెలరేగుతున్నాయ్. అసలు, సిట్ రిపోర్ట్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది!. ఒక్క దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఎలా దర్యాప్తు చేస్తారనే క్వశ్చన్స్‌కి సీబీఐ నుంచి సమాధానం లేదు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి ఇదే విషయాన్ని కోర్టుల్లో పదేపదే ప్రస్తావించారు. దస్తగిరి స్టేట్‌మెంట్‌పై ఆధారపడకుండా సీబీఐ సొంతంగా దర్యాప్తు చేయాలని కోరారు. అప్పుడే, అసలు నిజాలు బయటికి వస్తాయనేది అవినాష్‌రెడ్డి వాదన. అవినాష్‌రెడ్డి మొదట్నుంచీ చేస్తోన్న ఆరోపణ ఒక్కటే.. సీబీఐ విచారణ సరిగా జరగడం లేదనేది!. తాము చెప్పిన మాటలను సీబీఐ వినడం లేదని, దస్తగిరి మాటల ఆధారంగా దర్యాప్తు చేస్తోందని అంటున్నారు. ఒక వ్యక్తి చెప్పిన మాటల ఆధారంగా దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటికి వస్తాయనేది అవినాష్ వాదన. దస్తగిరి స్టేట్‌మెంట్లతో తేడా!. సిట్ రిపోర్ట్‌ను చూస్తుంటే సీబీఐ నిజంగానే కీలక విషయాలను పక్కనబెట్టిందనే అనుమానాలు కలుగుతున్నాయ్. సీబీఐ దర్యాప్తు మొత్తం తప్పుల తడకనే విమర్శలూ వస్తున్నాయ్!. మరి, ఈ ప్రశ్నలకు సీబీఐ ఏం సమాధానాలు చెబుతుంది!.