YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ధర్మానలోనూ... నిరాశేనా

 ధర్మానలోనూ... నిరాశేనా

శ్రీకాకుళం, జూన్ 16, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ రెడ్డిలో వైనాట్ 175 ధీమా పూర్తిగా అడుగంటిపోయింది. అయినా బింకంగా ఈ తొమ్మది నెలలూ కష్టపడి పని చేద్దాం.. విజయం మనదే అని పార్టీ నేతలకు, క్యాడర్ కు చెప్పుకుంటూ వస్తున్నారు.ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పని చేయండంటూ వారిని బతిమలాడుకుంటున్నారు. అయితే ఆయన కేబినెట్ లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలూ, నాయకుల మాటలు మాత్రం పార్టీ పరాజయం ఇప్పటికే ఖరారైపోయిందన్నట్లు మాట్లాడుతున్నారు. తాజాగా  రాష్ట్ర స్టాంప్లు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు   శ్రీకాకుళంలో  చేసిన వ్యాఖ్యలు పార్టీ పరువును నిలువుగా గంగలో ముంచేశాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే గత నాలుగేళ్లుగా వైసీపీ కార్యకర్తలు  ఆర్థికంగా బాగా చితికిపోయారు.జగన్  అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాల కోసం.. స్థానిక నేతలు, కార్యకర్తలు సొంత సొమ్ము ఖర్చు చేస్తూ వచ్చారు. ప్రభుత్వం కానీ, పార్టీ కానీ వారిని కనీసం పట్టించుకోలేదని  ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో వస్తున్న నగదుతో  స్థానికంగా సమావేశాలు పెట్టడం లేదని.. కార్యకర్తల చేతి చమురు వదుల్చుకుని కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు.  మరోవైపు గత మార్చిలో శ్రీకాకుళంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నిధుల పంపిణీ కార్యక్రమంలో ఇదే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. మగాళ్లు పోరంబోకులని.. తినేసి వెళ్లిపోతారని, ఇంటిని నడిపేది ఇల్లాలేనని.. అందుకే ఆమె పేరుతో ప్రభుత్వం పథకాలు అందిస్తోందని చెప్పారు.  ఇటీవల కాలంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏం మాట్లాడినా  వార్తల్లో  నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన మాటలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేలా  ఉంటున్నాయి. అయితే ధర్మాన లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు ఏదో యథాలాపంగా, నోరు జారీ పార్టీకి నష్టం చేసేలా మాట్లడడమేమిటన్న ఆశ్చర్యం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది.అదే సమయంలో వారిలో  తనలో పార్టీ పట్ల, పార్టీ అధినేత పట్ల పేరుకున్న అసంతృప్తిని ఈ విధంగా వెళ్లగక్కుతున్నారా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.  అదీ కాక తన రాజకీయ వారసుడిగా తనయుడు మనోహర నాయుడికి పార్టీ టికెట్ కోసం ధర్మాన చేసిన విజ్ణప్తిని సీఎం, పార్టీ అధినేత జగన్ నిరాకరించడం వల్లే ధర్మాన ప్రసాదరావు  పార్టీకి చేటు కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్న సందేహమూ వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది

Related Posts