YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆత్రేయపురం పూత రేకులకు అంతర్జాతయ భౌగోళిక గుర్తింపు

ఆత్రేయపురం పూత రేకులకు అంతర్జాతయ భౌగోళిక గుర్తింపు

విశాఖపట్టణం, జూన్ 15, 
ఆత్రేయపురం పూత రేకులకు అంతర్జాతయ భౌగోళిక గుర్తింపు లభించింది. ఆత్రేయపురంలో తయారయ్యే పూతరేకులను జియోగ్రాఫికల్ ఇండికేషన్స్‌ రిజిస్ట్రీలో నమోదు చేశారు.ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. నోరూరించే వంటకానికి ఆత్రేయపురం గ్రామం ఎప్పటి నుంచో ప్రసిద్ది చెందింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ రిజిస్ట్రీలో ఆత్రేయపురం పూతరేకులు నమోదయ్యాయి.భౌగోళిక గుర్తింపు కోసం డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పూతరేకుల సహకార సంఘం దరఖాస్తు చేసింది. దీనికి స్పందించిన కేంద్ర విభాగం ఫిబ్రవరి 13న విడుదల చేసిన జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ (జీఐ) జర్నల్‌లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటన ఇచ్చింది.అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చిన గడువు ఈనెల 13వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో భౌగోళిక గుర్తింపు వచ్చినట్లయిందని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పూతరేకుల సహకార సంఘం వివరించింది. ఆత్రేయపురం పూతరేకులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించినట్లయింది.రుచికరమైన తీపి వంటకం ఈ ప్రాంతం నుంచి ఇతరదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నోరూరించి వంటకానికి పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో విరివిగా వినియోగించే ఆత్రేయపురం పూతరేకులకు జాతీయ స్థాయిలో జిఐ గుర్తింపు రావడం గర్వించాల్సిన విషయమేనని తయారీదారులు చెబుతున్నారు.

Related Posts