YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయనగరంలో సిట్టింగ్ లకు టెన్షన్

విజయనగరంలో సిట్టింగ్ లకు టెన్షన్

విజయనగరం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్లు రావేమోనన్న బెంగ పట్టుకుంది. దీంతోపాటు నియోజకవర్గాల్లో వారిపై అసంతృప్త సెగలు మాత్రం మామూలు రేంజ్ లో లేవు. గత నాలుగేళ్లుగా అధికార పార్టీలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఇక్కడ సైకిల్ కు ఎదురుగాలి వీస్తుందని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి పార్టీ కొంపముంచుతుందని అధినేత భావిస్తున్నారన్న సమాచారం ఉంది.విజయనగరం జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలుంటే, అందులో ఆరు నియోజకవర్గాలను సైకిల్ పార్టీ సొంతం చేసుకుంది. తర్వాత వైసీపీ ఎమ్మెల్యే ఒకరు సైకిలెక్కేయడంతో బలం ఏడుకు పెరిగింది. ఎంపీ స్థానమూ టీడీపీదే. ఇలా బలంగా ఉన్న జిల్లాలో పార్టీ బలహీనపడిపోతుందన్న సమాచారం అధినేతకు అందింది. ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పనితీరు మార్చకపోతే సీటు ఇవ్వనని కూడా హెచ్చరించారు. దీంతో అనేక నియోజకవర్గాల్లో ఆశావహుల సంఖ్య కూడా బాగానే పెరిగింది..వైసీపీ టిక్కెట్ మీద గెలిచి టీడీపీలోకి జంప్ చేసి మంత్రి అయిన సుజయకృష్ణ రంగారావు సయితం ఎదురీత తప్పదంటున్నారు. మంత్రి అయిన తర్వాత సుజయకృష్ణ పూర్తిగా ప్రజలకు దూరమయ్యారంటున్నారు. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు బేబినాయనను రంగంలోకి దించాలన్న యోచనలో ఉన్నారట. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మి నాయుడు సీటుకోసం ప్రయత్నిస్తున్నారు. పార్వతీపురం నియోజకవర్గం పరిస్థితి కూడా అంతే. అక్కడ ఎమ్మెల్యే చిరంజీవులు పూర్తిగా వెనకబడిపోయారని చంద్రబాబు చిట్టా చెబుతోంది. ఇకటీడీపీకి కొంత అనుకూలంగా ఉన్న నియోజకవర్గం ఎస్.కోట మాత్రమేనని అంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చంద్రబాబు వద్ద 70 శాతం మార్కులు కొట్టేశారు. దీంతో ఈమె సేఫ్ జోన్ లో ఉన్నారు. మొత్తం మీద సైకిల్ పార్టీ కంచుకోటలో ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు ఈసారి టిక్కెట్ల కేటాయింపులో జాగ్రత్తలు పాటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.విజయనగరం నియోజకవర్గానికి మీసాల గీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీటి సరఫరా జరగడం లేదు. హుద్ హుద్ తుఫాను బాధితులకు లంకాపట్నంలో నిర్మించిన ఇళ్లు బాధితులకు అందించలేకపోయారు. జూట్ మిల్లు మూసివేయడంతో కార్మికులు ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు. మీసాల గీత ప్రజలకు అందుబాటులో ఉండరన్న టాక్ ఉంది. మరోవైపు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఈసారి తాను కాని తన కూతురు ఆతిదిని గాని విజయనగరం నుంచి బరిలోకి దిగాలని అశోక్ గజపతి రాజు యోచిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే మీసాల గీతకు టెన్షన్ ప్రారంభమైంది.గజపతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే కేఏ నాయుడుకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిధుల లేమికారణంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేకపోయారు. స్థానికంగా ఉండరన్న అపప్రధను కేఏ నాయుడు ఎదుర్కొంటున్నారు. ఆండ్ర జలాశయం ఆధునికీకరణ పనులు చేపట్టక పోవడం ఈయనకు మైనస్ అంటున్నారు. మామిడి మార్కెట్ నిర్వీర్యమైనా ఎమ్మెల్యే పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మాజీ మంత్రి పడాల అరుణ, టీడీపీ నేతలు శివరామకృష్ణ, ఎమ్మెల్యే సోదరుడు కొండబాబులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు సర్వేలో కేఏ నాయుడు ఎక్కడో ఉండటంతో ఆయనకు ఈసారి టిక్కెట్ డౌటేనని అంటున్నారు.నెలిమర్ల నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు స్ట్రాంగ్ గానే ఉన్నా కొన్ని కారణాలు ఆయన్ను కూడా వెనక్కు నెట్టేశాయంటున్నారు. ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం రావడంతో నారాయణస్వామినాయుడికి ప్లస్ అయిందనుకున్నారు అంతా. అయితే గత కొద్ది రోజులుగా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతుండటంతో ద్వితీయ శ్రేణినేతలు ఈ నియోజకవర్గంపై కన్నేశారు. నారాయాణస్వామినాయుడికి వయసు కూడా ఎక్కువగా ఉండటంతో ఈసారి టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారంజోరుగా సాగుతోంది. ఇక చీపురుపల్లిలో మాజీ మంత్రి మృణాళిని తీవ్రమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పనితీరు బాగా లేకనే ఆమెను చంద్రబాబు మంత్రిపదవి నుంచి తప్పించారు. ఈసారి మృణాళినికి టిక్కెట్ దక్కడం కష్టమేనని అంటున్నారు. అయితే ఆమెకు బదులు భర్ గణపతిరావుకు టిక్కెట్ ఇచ్చే అవకాశముందంటున్నారు.

Related Posts