దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు ఈరోజు విజయవాడ డివిజన్‌లోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఈటిటిసీ)లో నిర్వహించిన భద్రతా సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో విజయవాడ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీశివేంద్ర మోహన్, సీనియర్ రైల్వే అధికారులు, శాఖాధికారులు, సూపర్‌వైజర్లు మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు.అనంతరం గుంటూరు రైలు మహల్‌లో జరిగిన భద్రతా సదస్సులో కూడా ఆయన పాల్గొన్నారు. డివిజనల్ రైల్వే మేనేజర్, గుంటూరు డివిజన్, శ్రీ ఎం ,రామకృష్ణన్ శాఖాధికారులు, సీనియర్ సూపర్‌వైజర్లు మరియు డివిజన్లోని ఇతర సిబ్బంది పాల్గొన్నారు
జనరల్ మేనేజర్ గారికి డివిజన్లు ఈ భద్రతా సదస్సుసందర్భంగా, రైలు కార్యకలాపాల భద్రతను పెంపొందించడం కోసం దృష్టి సారించే వివిధ రంగాలపై వివరణాత్మకoగా దృశ్యామాద్యమo ద్వారా తెలియజేశారు . ఆపరేటింగ్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ మరియు మెకానికల్ వంటి వివిధ విభాగాల యొక్క భద్రతా అంశాలపై కూడా ఈ విభాగం ఉద్ఘాటించింది. దీనితోపాటు రాబోయే వర్షాకాలంలో చేపడుతున్న ముందస్తు జాగ్రత్త చర్యల గురించి కూడా వివరించారు. తరువాత ఇంటరాక్టివ్ సెషన్లో ఫ్రంట్లైన్ సిబ్బంది యొక్క ఆలోచనలు, ప్రశ్నలు మరియు సందేహాలను పరిష్కరించారు.
శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు సెమినార్‌లో ఫ్రంట్‌లైన్ సిబ్బంది మరియు సూపర్ వైజర్ల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతు భద్రతకు ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మరియు రైళ్లను సురక్షితంగా నడిపే విషయంలో రాజీపడకూడదని పేర్కొన్నారు. రైలు కార్యకలాపాల భద్రతకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలు మరియు నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆయన అన్నారు. సిబ్బంది సానుకూల దృక్పథంతో ఉండాలని, భద్రతతో కూడిన రవాణానే రైల్వే ప్రధాన లక్ష్యంగా ఎల్లప్పుడూ దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. జనరల్ మేనేజర్ గారు ఫ్రంట్లైన్ సిబ్బంది రైల్వేకు కళ్ళు మరియు చెవుల లాంటివారని వారి మధ్య సరైన సమన్వయం అవసరమని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందికి విధినిర్వహణలో లోతైన మరియు క్షుణ్ణమైన జ్ఞానాన్ని అందించే ప్రక్రియలో భాగముగ ఆచరణాత్మక, ఉద్యోగ శిక్షణపై కూడా ఆయన ఉద్ఘాటించారు.
జనరల్ మేనేజర్ గారు తరువాత డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో సెక్షన్ కంట్రోలర్లు మరియు బ్రాంచ్ అధికారులతో విడివిడిగా సమావేశాలను నిర్వహించి ఎలాంటి సత్వరమార్గ పద్ధతులను అవలంబించవద్దని మరియు అన్ని భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితoగా పాటించాలని ఆయన సిబ్బందికి సూచించారు.
విజయవాడలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం నుండి జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాణిక్‌ఘర్ గూడ్స్ షెడ్ వద్ద కొత్తగా నిర్మించిన రైల్వే లైన్ నుండి మొదటి ఐరన్ ఓర్ గూడ్స్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్, దక్షిణ మధ్య రైల్వే శ్రీ బినాగ్య, డివిజనల్ రైల్వే మేనేజర్, సికింద్రాబాద్ డివిజన్ శ్రీ ఏ. కె గుప్తా మరియు ఇతర అధికారులు కూడా రైల్ నిలయం నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Contributed by:
సురేష్ కశ్యప్