
విశాఖపట్నంలోని పెందుర్తిలో ఘటన
మంటల ధాటికి తట్టుకోలేకపోయిన వ్యక్తి
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స
భార్యను చంపిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి
విశాఖపట్నంలోని పెందుర్తిలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. పెందుర్తి పోలీస్ స్టేషన్ ముందు ఉన్న రోడ్డుపైకి వచ్చిన మహాలక్ష్మినాయుడు అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే, మంటల ధాటికి తట్టుకోలేక పరుగులు తీశాడు.
దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆసుపత్రిలో చేర్చారు.
ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా, ఆ వ్యక్తి గతేడాది తన భార్యను బ్యాటుతో మోది హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.