YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

 నేడు ప్రముఖ సంగీత దర్శకులు పి.ఆదినారాయణరావు వర్ధంతి.

 నేడు ప్రముఖ సంగీత దర్శకులు పి.ఆదినారాయణరావు వర్ధంతి.

 ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కళలకు పుట్టినిల్లు. సినిమా రోడ్‌లో ఉన్న యంగ్‌ మెన్స్‌ హ్యాపీ క్లబ్‌ (మెజిస్టిక్‌ థియేటరు) ఎందరో గొప్ప కళాకారులకు జన్మనిచ్చింది. అందులో ఎందరో సినీ దిగ్గజాలు. సి. పుల్లయ్య, సి.ఎస్‌.రావు, రేలంగి, జోగినాథం. బి.ఎ.సుబ్బారావు, కౌండిన్య, బాలయ్య, ఎస్‌.వి. రంగారావు, అంజలీదేవి, ఆదినారాయణ రావు, ఆకుల నరసింహారావు, నల్ల రామ్మూర్తి ఎందరో... వీళ్లంతా యంగ్‌ మెన్స్‌ హ్యాపీ క్లబ్‌లో తమ నటనకు మెరుగులు దిద్దుకొని తమను తాము తీర్చిదిద్దుకుని నటనలో రాణించినవారే. ఆకుల నరసింహారావు సుప్రసిద్ధ నటుడు. సంగీత విద్వాంసుడు. ఆయన శిష్యుడే ఆదినారాయణరావు. నాటకాలు రాయడం, పాటలకు సంగీతం సమకూర్చడం, నాటక ప్రదర్శనలో నేపథ్య సంగీతం వినిపించడం లాంటివి చేసేవాడు. ఆయన అసమాన ప్రతిభకు అందరూ ఆశ్చర్యపోయేవారు. అక్కడ పరిచయమైన నటి పెద్దాపురం వాసి అంజమ్మను పెళ్లి చేసుకున్నారు. సి.పుల్లయ్యగారి పిలుపునం దుకొని చెన్నపట్నం చేరుకున్నారు.
ఆదినారాయణరావు ఆ తర్వాత బొంబాయి, కలకత్తా నగరాలు తిరిగి అక్కడ సంగీత స్రస్ఠల నుంచి మెలకువలను నేర్చుకుని తనదైన ముద్రలో స్వర రచన చేసేస్థాయికి ఎదిగారు. ఈయన దగ్గర దిగ్గజాల్లాంటి సంగీత దర్శకులు సహాయకులుగా పని చేసేవారు. వారిలో ప్రముఖులు టి.వి. రాజు, సత్యం. ఆదినారాయణరావు సాధించిన దానితో సంతృప్తి చెందే రకం కాదు. ఇంకా ఏదో చెయ్యాలి. పరిపూర్ణతను సాధించాలి అనే పట్టుదల ఉన్న వ్యక్తి. అందుకే అతి తక్కువ చిత్రాలు మాత్రమే చేసినా అవి చరిత్రలో నిలిపోయాయి. స్వీయ నిర్మాణంలో వచ్చిన చిత్రాలన్నింటికీ ఆయనే సంగీతం అందించేవాడు. అలా ఆయన స్వీయ సంగీతంలో వచ్చిన చిత్రమే.. అనార్కలి!. ఈ చిత్రంలోని పాటలు తొలిసారిగా విన్న సినీ సంగీత ప్రియులందరూ ఆశ్చర్యపోయారు. ప్రశంసల వర్షం కురిపించారు.
[పాటలన్నీ ఆణిముత్యాలే
ఆదినారాయణరావు తన సుమధురమైన స్వర రచన ద్వారా అనార్కలి పాటలకు పది కాలాలు గుర్తుండి పోయేలా ప్రాణం పోశారు. ఇందులో 'జీవితమే... రాగసుధాభరితము ప్రేమ కథ మధురము', ఆ పాత మధురం. 'కలిసె నెలరాజు.. కాలువ చెలిని కలిసె యువరాజు.. అనార్కలిని' ఈ పాట మెలోడీ ప్రధానంగా నిత్యనూతనంగా ఉంటుంది. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా...' దర్బార్‌లో అంజలి పాడుతూ చేసిన నృత్యం ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతుంది. 'తాగి సోలేనని భ్రమసేనీలోకము', 'వియోగాలే విలాపాలే వీడని మాప్రేమ ఫలితాలా.. ప్రేమ జగానా.. వియోగానికేనా.. ప్రేమగాథ.. విశాదాంతమేనా...', 'రావోయీ సఖా.. నీ ప్రియ సఖి చేరగదోయి తరళిపోయె అనార్కలి ఆ విధాన తారయై..' ఇలా ప్రతిపాటా ఒక ఆణిముత్యమే. ఆదినారాయణరావు సంగీత ప్రతిభను చూసి ఉత్తరాది వారు ఉలిక్కిపడ్డారు. సంభ్రమాశ్చార్యాలతో జేజేలు పలికారు.

Related Posts