YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చిరంజీవి స్టోరీలో నాగ్

చిరంజీవి స్టోరీలో నాగ్

ఒక హీరో వద్దన్న కథకు మరో హీరో ఓకే చెప్పి అందులో నటించడం సినీ ఇండస్ట్రీలో కొత్తేం కాదు. అలా కొంత మంది హీరోలు మిస్ చేసుకున్న సినిమాలలో నటించి గొప్ప విజయాలను సొంతం చేసుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు చిరు వద్దన్న కథలో నాగార్జున నటిస్తున్నారన్న వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. మెహబూబాతో మరోసారి అభిమానులను నిరాశపరిచిన పూరీ జగన్నాథ్ తాజాగా నాగార్జునకు ఒక కథను వినిపించారట. దాన్ని విన్న నాగార్జున అందులో నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ కథ అప్పట్లో చిరు రీ ఎంట్రీ కోసం పూరీ చెప్పిన కథ అన్నది టాలీవుడ్ టాక్. కథను విన్న చిరు మొదట ఓకే చెప్పినప్పటికీ, ఆ తరువాత వద్దనుకున్నారు. అయితే ఈ కథలో మార్పులు చేసైనా సరే ఎలాగైనా చిరును ఒప్పిస్తానని పూరీ పలు సందర్భాలలో వెల్లడించారు. మరి ఇంతకు నాగ్‌కు పూరీ కథ చెప్పాడా? అందులో నటించేందుకు నాగార్జున ఒప్పుకున్నాడా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.  అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున ఇదివరకు ‘శివమణి’, ‘సూపర్’ చిత్రాల్లో నటించారు.

Related Posts