YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

1000 తగ్గి... 400 పెరిగిన బంగారం

1000 తగ్గి... 400 పెరిగిన బంగారం

ముంబై, జూన్ 17, 
బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించేలోపే మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి వరుసగా 5 రోజులుగా బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఏకంగా రూ. వెయ్యి వరకు తగ్గింది. అయితే శనివారం మళ్లీ ఒక్కసారిగా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. ఒకే రోజులో తులంపై ఏకంగా రూ. 400 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 54,700 వద్ద కొనసాగుతోంది. ఇక ఈ రోజు దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే.. తెలంగాణ రాజధానిలో శనివారం బంగారం ధర రూ. 400 పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,110వద్ద కొనసాగుతోంది. నిజామాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,100కాగా, 24 క్యారెట్ల ధర రూ. 60,110గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,110గా ఉంది. ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,100కాగా, 24 క్యారెట్ల ధర రూ. 60,110 వద్ద కొనసాగుతోంది. ఆధ్యాత్మితక నగరం తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ. 55,100కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,110గా ఉంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల విషయానికొస్తే..
* ఢిల్లీలో 24 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 60,460గా ఉంది.కిలో వెండి ధర రూ. 73,100, చెన్నైలో రూ. 78,500, బెంగళూరులో 73,000 వద్ద కొనసాగుతోంది. ఇక తెలంగాణ రాజధానిలో కిలో వెండి ధర రూ. 78,500కాగా, విజయవాడ, విశాఖపట్నంలో రూ. 78,500వద్ద కొనసాగుతోంది.

Related Posts