YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇక కరెంట్ కు స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు

ఇక కరెంట్ కు స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు

చెన్నై, జూన్ 17, 
దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఈక్రమంలోనే వినియోగదారులు విద్యుత్ వాడకం, తమ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ను రోజువారీగా మొబైల్ ఫోన్లలో చెక్ చేసుకునే వీలును కల్పించేందుకు కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విద్యుత్తు వినియోగదారుల హక్కులను సవరిస్తూ.. గురువారం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం డిస్కంలు అన్ని రకాల స్మార్ట్ మీటర్లను ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా రిమోట్ విధానంలో పరిశీలించాలి. స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్ వినియోగదారులకు వారి విద్యుతు వాడకానికి సంబంధించిన సమాచారాన్ని వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ లేదా ఎస్ఎంఎస్ ల ద్వారా అందుబాటులో ఉంచాలి. ఎప్పటికప్పుడు వారు తాము వాడిన యూనిట్లు, దానికి అయిన ఖర్చు, మిగిలిన నగదు నిల్వను తనిఖీ చేసుకోవడానికి వీలు కల్పించాలని విద్యుత్తు శాఖ పేర్కొంది.స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసిన తర్వాత విద్యుత్తు వాడకం గరిష్ట స్థాయిలో రికార్డు అయితే దాన్ని అంతకుముందు కాలానికి వర్తింపజేసి జరిమానా విధించకూడదు. స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసేటప్పుడు ఇచ్చిన పరిమితికి మించి గరిష్ఠ స్థాయిలో ఒక నెలలో విద్యుత్తు వాడకం నమోదు అయితే ఆ బిల్లింగ్ కాలం వరకు బిల్లును వాస్తవంగా నమోదైన గరిష్ఠ డిమాండ్ ఆధారంగా లెక్కించాలి. ఆ లెక్కింపులో వచ్చిన మార్పును వినియోగదారుడికి ఎస్ంఎస్ లేదా మైబైల్ యాప్ ద్వారా తెలిసేలా చేయాలి. వినియోగదారులకు మీటర్ కేటాయించే సమయంలో దాని సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు వినియోగం.. దానికి మించి నమోదు అయితే అందులోని కనిష్ఠ రికార్డు మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని మీటర్ లోడ్ ను సవరించాలి. తదుపరి ఆర్థిక సంవత్సరం నుంచి ఆ ప్రకారం బిల్లింగ్ సైకిల్ అమలు చేయాలి. విద్యుత్ వినియోగాన్ని సమతౌల్యం చేయడానికి వాడుక సమయాన్ని పీక్ అవర్స్, టైమ్ ఆఫ్ డే గా విభజిస్తారు. టైమ్ ఆఫ్ డేలో వినియోగం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వాడే విద్యుత్తుకు తక్కువ రుసుం వసూలు చేయాలని కేంద్రం పేర్కొంది. ఎలాంటి వినియోగదారులకు ఎప్పటి నుంచి ఈ నిబంధనను వర్తింపజేయాలో ఇందులో పూర్తిగా వివరించింది. పది కిలో వాట్లకు మించి డిమాండ్ ఉన్న వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు 2024 ఏప్రిల్ ఒకటవ తేదీ లోపు టైమ్ ఆఫ్ డే టారిఫ్ అమలు చేయాలని స్పష్టం చేసింది. వ్యవసాయ దారులు మినహా ఇతర వినియోగదారుల అందరికీ ఈ నిబంధనను 2025 ఏప్రిల్ 1వ తేదీలోపు వర్తింపజేయాలని పేర్కొంది. స్మార్ట్ మీర్ వినియోగదారులకు అయితే ఈ టారిఫ్ ను మీటర్ ఏర్పాటు చేసిన తక్షణం అమలు చేయాలి. టైమ్ ఆఫ్ డేగా ప్రకటించిన సమయంలో వాణిజ్య వినియోగదారులు వాడే విద్యుత్తుకు వసూలు చేసే ఛార్జీలు సాధారణ రుసుంలో 20 శాతం మించి తగ్గకూడదని వెల్లడించింది. సాధారణ వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీ 10 శాతానికి మంచి తగ్గకూడదని వివరించింది. పగటిపూట సౌర విద్యుత్తు సరఫరా చేసే 8 గంటల సమయంలో వాడే విద్యుత్తుకు వసూలు చేసే ఛార్జి సాధారణ టారిఫ్ కంటే కనీసం 20 శాతం తక్కువ ఉండాలి.

Related Posts