YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వీ ఆర్ ఎస్ కు తెలంగాణ హెల్త్ డైరక్టర్..?

వీ ఆర్ ఎస్ కు తెలంగాణ హెల్త్ డైరక్టర్..?

ఖమ్మం, జూన్ 17, 
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఏం చేసినా సంచలనమే. ఈ మధ్య తాను నడిపిస్తోన్న స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ తరచూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ క్రమంలోనే.. డీహెచ్ తన పదవికి వీఆర్ఎస్ ఇచ్చేసి.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొత్తగూడెం సీటు కోసమే ఈ సేవా కార్యక్రమాల పేరుతో ప్రజలను మచ్చిక చేసుకుంటున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ వార్తలతో పాటు కొంత మంది ఇంకో అడుగు ముందుకేసీ.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్‌ని వైరల్ చేస్తున్నారు. అదేంటంటే.. డీహెచ్ శ్రీనివాస్ ఇప్పటికే.. వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారని.. సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. ఈ వార్తలపై శ్రీనివాస రావు స్పందించారు.
ఉద్యోగానికి  రిజైన్ చేయబోతున్నట్టు, వీఆర్‌ఎస్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నట్టు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవఅని శ్రీనివాస రావు స్పష్టం చేశారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా అందరికీ తెలియజేస్తానంటూ చెప్పుకొచ్చారు. కొత్తగూడెంలో ప్రజలకు సేవ చేయడానికి తన వంతు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రస్తుతం పనిచేస్తున్నానని.. భవిష్యత్తులోనూ ఎలాంటి కర్తవ్యం ఇచ్చినా నెరవేరుస్తానని డీహెచ్ శ్రీనివాస్ రావు వివరించారు.అంతే కాదు.. అందరూ కోరుకుంటున్నట్టుగా కొత్తగూడెం నుంచి తనను ఎమ్మెల్యే‌గా పోటీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశిస్తే తప్పకుండా పాటిస్తానంటూ స్పష్టం చేశారు కేసీఆర్‌. అయితే.. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ చెప్తానని.. కానీ.. అప్పటివరకు దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు డీహెచ్ శ్రీనివాస్ రావు. దీంతో.. తాను పొలిటికల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారని.. అది కూడా కొత్తగూడెం నుంచే పోటీ చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నట్టు తేటతెల్లమయిపోయింది. ఇక వీఆర్ఎస్‌కు అప్లై చేసుకోవటమే తరువాయి.. వెంటనే గులాబీ కండువా కప్పుకోవటం.. కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించటం చకచకా జరిపోనున్నాయనే చర్చ సాగుతోంది

Related Posts