
వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన జట్టు ఒకటి.. వరుసగా నాలుగు విజయాలు సాధించిన జట్టు మరొకటి..సన్‌రైజర్స్‌కు పూర్తి భిన్నంగా సాగుతున్న జట్టు కోల్‌కతా. తొలి 11 మ్యాచ్‌ల్లో కేవలం 5 విజయాలతో ప్లేఆఫ్స్ బెర్తుకు దూరంగా కనిపించిన కోల్‌కతా చివర్లో పుంజుకున్న తీరు అద్భుతం. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుచేసింది. రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు లీగ్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ చివరి దశలో అనూహ్యంగా డీలా పడింది. దాంతో, కోల్‌కతా ఈ పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఈ నెల 27న వాంఖడేలో జరిగే తుదిపోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.