YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొండా మురళి కుక్కలాగా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

కొండా మురళి కుక్కలాగా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం నాడు పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొండా మురళి అనే వ్యక్తి ఆదివారం  ప్రెస్ మీట్ లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. కొండా సురేఖ, ఆమె బిడ్డ కూడా పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళ భాష ఏమిటీ ? సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. కొండా మురళి కుక్క లా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తెలంగాణ సాధించారు. అందర్నీ అక్కున చేర్చుకోవాలని కేసీఆర్ భావించి కొండా దంపతులకు రాజకీయ భిక్ష పెట్టారు. అయినా ఆ గౌరవాన్ని నిలుపుకోలేక పోయారని అన్నారు. మాట్లాడితే మగతనం గురించి మాట్లాడుతారు .ఎలా నిరూపించుకొవాలి ? ..అసలు వరంగల్ అభివృద్ధి లో కొండా మురళి పాత్ర ఏమిటీ ? రాజకీయ పునర్జన్మ నిచ్చిన కేసీఆర్ పై అవాకులు చవాకులా అని అన్నారు. మగతనం  ఉండాలంటే మీసాలు ఉండాలా . .కేసీఆర్, కేటీఆర్  లపై అనుచితంగా మాట్లాడితే ప్రజలే కొండా మురళి ని ఉరికించి కొడతారు. .కొండా మురళి ఏం చేసి అన్ని ఆస్తులు కూడబెట్టారో చెప్పాలి. .కొండా మురళి తాను గుండా, హంతకుడినని ఒప్పుకుంటున్నారు. .దమ్ముంటే పరకాల కు రా ..నా మీద పోటీ చేసి గెలువు. .అందర్నీ తిట్టే రకం కొండా మురళి. రేపు రేవంత్ రెడ్డి ని కూడా తిడతారు.   సోనియాను కేసీఆర్ ను జగన్ ను ఇదివరకే తిట్టారు. .కొండా మురళి చేసిన పనులకు దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడు. చేయని పనులకు బిల్లులను క్లెయిమ్ చేసిన మోసగాడు కొండా. .కొండా ,ముందు భాష మార్చుకోవాలి.లేదంటే నేను నోరు తెరవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Related Posts