జూబ్లీహిల్స్‌లో ఓ కారును ఢీకొట్టి, ప్రశ్నించినందుకు తనకు పలువురు పెద్దలతో సంబంధాలున్నాయని బెదిరించి పరారైన సంగతి తెలిసిందే. అమీర్‌పేటకు చెందిన హర్మిందర్ సింగ్ తన కారులో కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప సొసైటీలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 33లో వారి కారును దర్శకుడు బాబీ కారు వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది.దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినీ ప్రముఖుల పేర్లు చెప్పి బాబీ తనను బెదిరించాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాబీ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.