YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వ్యూహాం కోసమేనా

వ్యూహాం కోసమేనా

విజయవాడ, జూన్ 20, 
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వివాదమే. ఆయన వ్యాఖ్యలు చేసే చేష్టలు ఒక్కోసారి పెద్ద దుమారమే రేపుతాయి. ఈ మధ్య ఎక్కువగా పొలిటికల్ గా కూడా సెటైర్లు వేస్తూ ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు ఆర్జీవి. సోషల్ మీడియాలో ప్రస్తుత రాజకీయ అంశాలపై తనదైన స్టైల్ లో స్పందిస్తూ కౌంటర్ లు ఇస్తున్నాడు. ఈయన చేసే ట్వీట్లు, పోస్ట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీను సమర్థిస్తూ ప్రతిపక్షాలపై కావాలనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. చాలా రోజుల తర్వాత సీఎం జగన్ తో ఆర్జీవి భేటీ అవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. రామ్ గోపాల్ వర్మ గత కొన్నేళ్లుగా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లోనే సినిమాలు తీస్తున్నాడు. అలాగే ఆయన గత కొంత కాలంగా వైసీపీ పార్టీను సమర్థిస్తూ వస్తోన్న విషయం కూడా విదితమే. అందుకే ప్రతిపక్ష టీడీపీ, దాని మిత్రపక్షం జనసేనను ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ లైఫ్ స్టోరీ ను బేస్ చేసుకొని ఓ పొలిటికల్ డ్రామా సినిమాను తెరెక్కిస్తున్నారు. ప్రజల్లో వైఎస్ జగన్ పై సింపతీ వచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మూవీతో పాటు ‘శపథం’ అనే సినిమాను కూడా జగన్ లైఫ్ స్టోరీను బేస్ చేసుకునే తీస్తున్నారట. ఇప్పటికే ఈ ‘వ్యూహం’ అనే సినిమాకు సంబంధించి కొన్ని లుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అందులోని పాత్రలు కూడా వైఎస్ జగన్, వైఎస్ భారతిలను పోల్చి ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ను ఆర్జీవి కలుస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరి మూవీ కోసం చర్చించడానికి వెళ్లారా మరేదైనా విషయం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ‘వ్యూహం’ నేపథ్యంలో గతంలో కూడా ఆర్జీవీ.. జగన్‌ను కలిశారు.గతంలో రామ్ గోపాల్ వర్మ ఎలాంటి పొలిటికల్ సైడ్ తీసుకునేవాడు కాదు. ఎవరు తప్పు చేసినా ఎవరు మంచి చేసినా తన స్టైల్ లో స్పందించేవాడు. అయితే అనూహ్యంగా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీకు దగ్గరయ్యాడు వర్మ. అందుకే చంద్రబాబుకు వ్యతిరేకంగా ‘లక్ష్మీస్’ ఎన్టీఆర్ తీశాడనే వాదనలు ఉన్నాయి. ఇక ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత బహిరంగంగానే పార్టీకు మద్దతిస్తున్నాడు ఆర్జీవి. వైసీపీను పొగుడుతూ ప్రతిపక్షాలను తిడుతూ నిత్యం ఏదొక పోస్ట్ ను షేర్ చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ కు కలిసొచ్చేలా ఈ ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలను ప్లాన్ చేశాడనేది టాక్. అయితే ఇప్పుడు సీఎం జగన్ తో భేటీలో ఈ మూవీల గురించి మాట్లాడారా లేదా మరేదైనా పొలిటికల్ చర్చ నడిచిందా అనేది చూడాలి. రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. గతంలో ‘వంగవీటి’ సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీ కొంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత 2019 ఎన్నికలకు ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తీశారు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఈ మూవీ తర్వాత మళ్లీ కొన్నాళ్ల తర్వాత ‘కొండా’ అనే పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఓ సినిమా చేశారు. ఆ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియలేదు. ప్రమోషన్స్ బాగానే చేసినా సినిమా అసలు ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ వై ఎస్ జగన్ లైఫ్ స్టోరీ బ్యాక్డ్రాప్ లో ఏకంగా రెండు సినిమాలు తెరకెక్కిస్తామని ప్రకటించాడు ఆర్జీవి. మరి ఈ సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి. ఈ మూవీ లు కూడా గత సినిమాల లాగా ఏమాత్రం బెడిసికొట్టినా అసలకే మోసం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ అభిమానులు.

Related Posts