ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లో పెరుగుతున్న మొబైల్ ఫోన్ల విక్రయాల వ్యాపారంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ‘హ్యాపీ’ మొబైల్స్ విక్రయ కేంద్రాలను హలో మొబైల్స్ విస్తరించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 175-200 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు రూ.70-80 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని హలో మొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కె.కృష్ణ పవన్ తెలిపారు. రామ్‌చరణ్‌ను కంపెనీ ప్రచారకర్తగా ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.వినియోగదారులకు సిబిల్ రేటింగ్ ఆధారంగా రుణాలు అందించడానికి బజాజ్ ఫిన్, హోమ్ క్రెడిట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మొబైల్ ఫోన్ విలువలో 10 శాతం చెల్లిస్తే, ఆధార్ కార్డు ఆధారంగా రుణం లభిస్తుందన్నారు. జూన్ మొదటి వారంలో హైదరాబాద్‌లో ఒకే సారి 21 హ్యాపీ విక్రయ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు.