YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్‌లో అసలేం జరుగుతోంది..

హైదరాబాద్‌లో అసలేం జరుగుతోంది..

హైదరాబాద్, జూన్ 22, 
శాంతిభద్రతల్లో దేశంలో అంత్యంత సేఫ్‌ అండ్ సెక్యూర్ సిటీగా హైదరాబాద్ పేరు తెచ్చుకుంది.. కానీ ఇప్పుడు ఆ పేరుకే ప్రశ్న తగిలేలా పరిస్థితి ఏర్పడింది.. జంట నగరాల్లో 15 గంటల్లోనే ఐదు ప్రాంతాల్లో హత్యలు జరిగాయి. గంటల వ్యవధిలో జరిగిన హత్యలు భాగ్యనగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి..ఇంతకీ ఈ హత్యలకు కారణం ఎంటి ?? లక్షలాది సీసీ కెమెరాలు ఉన్నాయన్న భయం ఏ మాత్రం నిందితులకు పట్టనట్టు ఉంది..హైదరాబాద్‌లో అసలేం జరుగుతోంది.. ఒక వైపు శాంతి భద్రతల పరిరక్షణ లో దేశంలోనే నెంబర్ 1 గా. తెలంగాణ పోలీస్..కానీ ఇలా గంటల వ్యవధిలోనే ఇన్ని దారుణ హత్యలు ఆందోళనకరంగా మారాయి. అర్ధరాత్రి టప్పాఛబుత్రలో ఇద్దరు ట్రాన్స్జెండర్ల హత్యను గుర్తుతెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు. మైలార్దేవ్పల్లి పీఎస్ లిమిట్స్లో రెండు హత్యలు జరిగాయి. ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో కొట్టి దుండగులు చంపారు. చాదర్‌ఘాట్‌ పీఎస్‌ లిమిట్స్ పరిధిలో మరొకరిని హత్య చేశారు. అజంపురాలో గుర్తుతెలియని వ్యక్తిని హతమార్చారు దుండగులు. రాత్రే కాదు పట్టపగలు సైతం హత్యలు చేస్తున్నారు. వరుస హత్యలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇక మరో వైపు నార్సింగిలో తనను ప్రేమించలేదని యువతిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. బాధితురాలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా.. నిందితుడు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ గుంటూరు జిల్లాలో ఒకే ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. ఇక చాదర్ ఘాట్‌లో ఓ యువకుడిని నడిరోడ్డుపై దారుణంగా హత్య చేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. యువకుడిని వెంబడించిన ఓ వ్యక్తి.. అతడిని కత్తితో వెనుక నుంచి పొడిచి పారిపోయాడు. బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజంపురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడి బైక్‌పై తన భార్యను చూసి కోపోద్రిక్తుడైన నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అజంపురా కట్టెలగూడ ప్రాంతానికి చెందిన యూసుఫ్ అక్బర్ (30) అనే వ్యక్తి సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో బైక్‌పై వెళుతున్నాడు. అది గమనించిన భర్త ఓ బంధువు సాయంతో బైక్‌పై వారిని వెంబడించాడు. యూసఫ్‌ను వెంబడించి పొడిచి చంపేశాడు. ఆ యువకుడు తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నిందితుడు ఆరోపిస్తున్నాడు. హత్య అనంతరం అతడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ మనోహర్ సందర్శించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. టప్పాచబుత్రలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు హత్యకు గురయ్యారు. ఓ యువకుడిని ట్రాన్స్‌జెండర్‌గా మార్చేందుకు ప్లాన్ చేయగా.. అందుకు ఆ యువకుడు అంగీకరించలేదని తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట చాంద్రాయణగుట్టలో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా అతడిని ట్రాన్స్‌జెండర్‌గా మార్చేందుకు ప్రయత్నించిన ట్రాన్స్‌జెండర్లు దారుణంగా హత్యకు గురయ్యారు. బాధితుడి సోదరులే ఈ హత్యలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు మైలార్ దేవుపల్లి పరిధిలో దారుణం చోటుచేసుకుంది.  దుర్గానగర్ చౌరస్తా సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలు జరగడానికి కొన్ని గంటల ముందు అదే ప్రాంతంలో మరొకరు హత్యకు గురయ్యారు. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంటల వ్యవధిలోనే ముగ్గురిని అతికిరాతంగా చంపివేశారు. చనిపోయిన ముగ్గురు కూడా గుర్తుతెలియని వ్యక్తులని పోలీసులు అంటున్నారు. ఈ ముగ్గురిని కూడా ఒకే తరహాలో ఒకే తీరులో చంపారని పోలీసులు చెప్పారు. అయితే ముగ్గురిని చంపడానికి గల కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికైతే అక్కడ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. హత్యలకు పాల్పడిన నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతూనే ఉంది. సీసీ కెమెరాలు ఆధారంగా నిందితుల ఆనవాలు గుర్తిస్తున్నారు పోలీసులు . గంటల వ్యవధిలో ఇన్ని హత్యలు చోటు చేసుకోవడం పోలీసులకు సవాలు గా మారింది..ఇటీవల ఒకే రోజు ఇన్ని హత్యలు చోటు చేసుకున్న ఘటనలు జరగలేదు… దీంతో ఎలాగైనా సరే త్వరితగతిన ఈ కేస్ లను చేధించాలని పోలీసులు శ్రమిస్తున్నారు.

Related Posts