YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అడ్డూ, అదుపు లేకేండా అక్రమ నిర్మాణాలు

అడ్డూ, అదుపు లేకేండా అక్రమ నిర్మాణాలు

విశాఖపట్టణం, జూన్ 24, 
విశాఖలో అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని జీవీఎంసీ కమిషనర్ చెబుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ కింద స్థాయి అధికారులు పెడ చెవిన పెడుతున్నారు. జోన్ 5‌లో డోర్ 44 - 15 - 99 లో స్టిల్ టు జి ప్లస్ టు అనుమతులు తీసుకొని అంతుకు మించి అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నారు. బీఏ నెంబర్ 1086/5894/B/Z5/TEM /2022లో 100 గజాల్లో భవనాన్ని నిర్మిస్తున్నట్టు ప్లాన్‌లో చూపించారు. అయితే 170 గజాల స్థలంలో భవన నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనానికి దక్షిణ భాగంలో ఉన్న గెడ్డను సైతం పది అడుగులు ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారు.అయితే సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్లకు గంతలు కట్టుకొని వ్యవహరిస్తున్నారనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అనుమతులు తీసుకున్న సమయంలో పునాదులు తీసేటప్పుడు ప్లానింగ్ అధికారులు పోస్ట్ వెరిఫికేషన్ చేసి, 30 అడుగుల రోడ్డు, మినిమం ఒక మీటరు సెట్ బ్యాక్ ఉన్నాయో లేదో పరిశీలించి నిర్మాణానికి ఓకే చెప్పాల్సి ఉంది. భవన యజమాని, ప్లానింగ్ అధికారులకు భారీ మొత్తంలో మామూళ్లు ముట్టచెప్పడంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వార్డు సచివాలయం ప్లానింగ్ సెక్రెటరీ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనిపై కమిషనర్ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Related Posts