YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సింహపురిలో సిగపట్లు

సింహపురిలో  సిగపట్లు

నెల్లూరు, జూన్ 24, 
: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీ జెండా ఎగరవేసేందుకు స్కెచ్‌ వేస్తోంది ఆ పార్టీ నాయకత్వం. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరం కావడంతో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు. శ్రీధర్ రెడ్డి పార్టీకి దూరమైన తర్వాత… రూరల్ పరిధిలో వైసీపీకి చెందిన 16 మంది ఆదాల వైపునకు వచ్చారు. మరో పదిమంది శ్రీధర్ రెడ్డితోనే కొనసాగుతున్నారు. శ్రీధర్ రెడ్డి వర్గంలోని కార్పొరేటర్ల డివిజన్ లలో తన వర్గానికి చెందిన నేతలను ఇంఛార్జీలుగా నియమిస్తున్నారు ఆదాల. కొన్ని చోట్ల ఇంకా సరైన నేతలు దొరకకపోవడంతో అక్కడ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా డివిజన్ లలో అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలిస్తున్నారు.వారం రోజుల నుంచి ఆదాల దూకుడు పెంచడంతో స్థానిక నేతలు కొందరు ఆయన వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్థానని ఇప్పుడు సహకారం అందిస్తే తర్వాత తాను మరింత సహకరిస్తానని కింది స్థాయి నాయకులకు చెబుతున్నారట ఆదాల. తమ అనుచరులు అటువైపు చూస్తుంటడంతో కోటంరెడ్డి వర్గంలోని కార్పొరేటర్లకు పల్స్‌రేట్‌ పెరిగిపోతోందట. కొందరు ఆదాలతో ఫోన్‌లో టచ్‌లో ఉంటుూ.. మద్దతిస్తామని చెబుతున్నారట. ఇప్పటికే నలుగురు కార్పొరేటర్లు ఆదాల వైపు వెళ్లేందుకు సిద్ధమైనా.. శ్రీధర్ రెడ్డి నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గి వెనుకాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆదాల కొత్త స్కెచ్‌లో భాగంగా మొదట మహిళా కార్పొరేటర్ల భర్తలు.. వారి కుటుంబ సభ్యులను తన వైపునకు తిప్పుకుంటున్నారట. కుటుంబ సభ్యులు వచ్చేస్తే… తర్వాత వాళ్ళు రాక ఎక్కడికిపోతారన్నది ఆయన లాజిక్‌ అట. పైగా ప్రజల్ని, కార్పొరేటర్స్‌ని ఆకట్టుకునేందుకు అక్కడ అభివృద్ధి కార్యక్రమాల జోరు పెంచారట.పనులు జరుగుతుండడంతో ఆ డివిజన్ల ఇన్ఛార్జ్‌లకు ఆర్థికంగా ప్రయోజనం కూడా కలుగుతోంది. అలా ఎన్నికల సమయానికి అన్ని డివిజన్లలో బలమైన వర్గాన్ని సిద్ధం చేసుకోవాలన్నది ఎంపీ వ్యూహంగా చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకూ టిడిపి తరపున నియోజకవర్గ వ్యవహారాలను ఆదాల పర్యవేక్షించారు. ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని నేతలతో సత్సంబంధాలు కొనసాగించారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నా…అప్పుడు తనకు మద్దతిచ్చిన టీడీపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. మొత్తం మీద సింహపురి సిత్రాలు రాబోయే రోజుల్లో కొత్తగా మారబోతున్నాయి.

Related Posts