YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చౌదరి హిస్టరీ చాలా ఉంది

చౌదరి హిస్టరీ చాలా ఉంది

హైదరాబాద్, జూన్ 24, 
డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికిపోయిన తెలుగు నిర్మాత క్రిష్ణ ప్రసాద్ చౌదరిని విచారణ చేస్తుండగా పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఆయన కస్టడీ రిపోర్టులో పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. కేపీ చౌదరి బయట పెట్టిన కొందరు సెలబ్రిటీల పేర్లను కూడా రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈయన ప్రముఖులతో పాటు, సెలబ్రిటీలకు కొకైన్ అమ్మినట్లుగా పోలీసులు గుర్తించారు. బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డితో పాటు, బెజవాడ భరత్, తేజ, రఘుతేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, ఠాగోర్ ప్రసాద్, శ్వేత సహా పలువురి పేర్ల కేపీ చౌదరి లిస్టులో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అషురెడ్డి, జ్యోతి, సురేఖా వాణితో వందల కాల్స్ మాట్లాడినట్లుగా గుర్తించారు. వీరితో కేపీ చౌదరి దిగిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. స్నేహిత హిల్స్ లోని సిక్కీ రెడ్డి ఇంట్లో తరచూ పార్టీలు నిర్వహించేవాడని తెలుస్తోంది.

Related Posts