YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇక సిమెంట మంట తప్పదు

ఇక సిమెంట మంట తప్పదు

జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయించిన పన్ను రేట్ల వల్ల సిమెంట్‌ ధరలు పెరగనున్నాయి. వస్తు సేవల పన్ను లో సిమెంట్‌పై కేంద్రం 28 శాతం పన్ను రేటును నిర్ణయించింది. తాము అంచనా వేసినట్లుగానే సిమెంట్‌ అధిక పన్ను పరిధిలోకి వచ్చిందని ఆ పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. పెరగనున్న ధరలను వినియోగదారులపై వేస్తామని ఆ కంపెనీలు పేర్కొన్నట్లు బిజినెస్‌ లైన్‌ ఒక కథనం వెల్లడించింది. కొంత మొత్తం ధరలను వినియోగదారుపై వేయనున్నామని గ్రాసిమ్‌ ఇండిస్టీస్‌ చీఫ్‌ ఫైనాన్సీయల్‌ ఆఫీసర్‌ సుశీల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. పెరగనున్న ధరలు అంతిమంగా వినియోగదారుడు భరించాల్సిందేనన్నారు. జిఎస్‌టి అంశాలు అన్నీ కొలిక్కి వచ్చే సరికి ఇంకా సమయం పడుతుందన్నారు. పన్ను శ్లాబుల నిర్ణయాన్ని అహ్వానిస్తున్న ట్లు ఈ రంగం నిపుణులు పేర్కొన్నారు. కొన్ని కేటగిరీల్లోని ముడి సరుకులపై 5 శాతం పన్ను విధానం మంచి నిర్ణయమన్నారు. తుది ఉత్పత్తులపై పన్ను అధికంగా ఉండటం ద్వారా కొంత పరిశ్రమలపై ఒత్తిడి చోటు చేసుకోనుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.సిమెంట్‌ ధరల్లో పెరుగుదల నిర్మాణ, మౌలిక రంగాలకు భారం కానుంది. సిమెంట్‌ అధారిత అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని త్వరలోనే ప్రారంభం కానున్నాయి. జులై ఒక్కటో తేది నుంచి జిఎస్‌టి అమల్లోకి రానున్న నేపథ్యంలో సిమెంట్‌ ధరలు పెరగను న్నాయి. దీంతో నిర్మాణ, మౌలిక వసతుల ప్రాజెక్టుల వ్యయం పెరగనుంది. కాగా ముడి సరుకులు అయినా సున్నపురాయి, ఇసుక, జిప్సమ్‌, ముడి ఇనుము తదితర ఉత్పత్తులపై 5 శాతం పన్ను రేటును నిర్ణయించడంతో సిమెంట్‌ తయారీదార్లకు కొంత మద్దతు లభించనుందని గ్రాంట్‌ తొర్టొన్‌ ఇండియా పార్లనర్‌ బిరెన్‌ వ్యాస్‌ పేర్కొన్నారు. 

Related Posts