YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంబేద్కర్ స్మృతి వనం ఇంకెప్పుడు మూడేళ్ల నుంచి కొనసాగో...తున్న పనులు

అంబేద్కర్ స్మృతి వనం ఇంకెప్పుడు మూడేళ్ల నుంచి కొనసాగో...తున్న పనులు

విజయవాడ, జూన్ 26, 
ఏపీలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం సాగుతూనే ఉంది. వారం పదిరోజులకోసారి మంత్రులు, అధికారులు సందర్శించడం, నేడో రేపో రెడీ అయిపోతుందని ప్రకటించడం పరిపాటిగా మారింది. రూ.400కోట్ల రుపాయల బడ్జెట్ పెరిగినా విగ్రహ నిర్మాణం మాత్రం అనుకున్న స్థాయిలో ముందుకు కదలడం లేదు. అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని మొదలుపెట్టిన 125 అడుగుల విగ్రహ నిర్మాణం కొనసాగుతోంది. విజయవాడ నడిబొడ్డన స్వరాజ్య మైదానంలో భారీ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణ పనులు ఏడాది క్రితమే పూర్తి కావాల్సి ఉన్నా డిజైన్లు ఖరారు కాకపోవడం, నిధుల లేమి వంటి సమస్యలతో దాదాపు ఏడాది ఆలశ్యంగా పనులు ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటి పనులు పూర్తి చేస్తామని ప్రకటించినా చేయలేకపోయారు.ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ప్రారంభించిన అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం అంచనాలు రెట్టింపయ్యాయి. పొరుగున తెలంగాణ రాష్ట్రంలో అన్ని హంగులతో రూ.200కోట్ల రుపాయల వ్యయంతో విగ్రహ నిర్మాణం పూర్తైతే అదే తరహా విగ్రహానికి ఏపీలో రూ.400కోట్లకు అంచనాలు పెంచారు.సబ్ ప్లాన్‌ నిధులతో చేపట్టిన విగ్రహ నిర్మాణంలో దానికి సంబంధం లేని పనులు కూడా కలిపేసి అంచనాలు పెంచారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమికంగా రూ.380 కోట్ల రుపాయల వ్యయంతో నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు నత్తనడకన సాగుతున్నా అంబేడ్కర్ జయంతి రోజుకు పనులు పూర్తి అవుతాయని మొదట్లో చెబుతూ వచ్చారు. ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, అధికారుల వరకు వారం, పదిరోజులకో సారి విగ్రహ నిర్మాణం పరిశీలించడం సిద్దమైపోతుందని ప్రకటనలు గుప్పించారు. చివరకు గడువులోగా పూర్తి కాదని తెలిసి జులై నాటికి సిద్దం చేస్తామని ప్రకటించారుఆ గడువులోగా కూడా విగ్రమ నిర్మాణం పూర్తి కాదని తెలిసినా గత ఆర్నెల్లుగా మంత్రులు, అధికారులు అబద్దాలతో జనాల్ని మభ్య పెడుతూ వచ్చారు. అంబేడ్కర్ జయంతి నాటికి విగ్రహ‍ నిర్మాణం పూర్తి కాదని తేలిపోవడంతో జులై నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జులై నాటికి కూడా విగ్రహ నిర్మాణం సాధ్యం కాదని తేలిపోయింది. సగానికి పైగా విగ్రహ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం రూ.268 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరినట్లు మంత్రి, అంబేద్కర్ నిర్మాణ కమిటీ ఛైర్మెన్ మేరుగు నాగార్జున వెల్లడించారు. నిర్మాణ వ్యయం పెరిగినా నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా జరుగుతున్న స్మృతివనం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను జూలై నాటికి పూర్తి చేస్తామని కొద్ది నెలల క్రితం ప్రకటించారు. 2020లో అంబేడ్కర్ స్మృతి వనం నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది.ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ లో వేల కోట్ల రుపాయల విలువైన పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ భూములను అంబేద్కర్ స్మృతివనం నిర్మాణానికి కేటాయించడంతో పాటుగా రూ.268 కోట్ల ను మంజూరు చేశారు. స్మృతివనం ప్రాంగణాన్ని అత్యాధునిక పద్ధతుల్లో సుందరీకరించాలని నిర్ణయించడంతో అదనంగా మరో రూ.106 కోట్లను మంజూరు చేశామన్నారు. పురపాలక శాఖ మరో రూ.6 కోట్లను స్మృతివనం పనులకు మంజూరు చేసిందని, ప్రస్తుతం అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం రూ.380 కోట్లకు చేరిందని వివరించారు.విగ్రహావిష్కరణ పూర్తయ్యే సమయానికి అంచనా వ్యయం రూ.400 కోట్లు దాటే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగినా స్మృతివనం పనులు చరిత్రలో మిగిలిపోయేలా చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో దేశంలో మరెక్కడా లేని విధంగా ఈపనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారుఅంబేడ్కర్ విగ్రహ నిర్మాణంతో పాటు విజయవాడలో ఫుట్‌పాత్‌ల మీద గ్రానైట్‌లు పరిచే కార్యక్రమాన్ని కూడా అధికారులు చేపట్టారు. ఎక్కడా లేని విధంగా ఫుట్‌పాత్‌లను గ్రానైట్‌ రాళ్లతో అలంకరించడానికి అంబేడ్కర్ స్మృతి వనం నిధుల్ని వినియోగిస్తున్నారు. విగ్రహ నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.పొరుగు రాష్ట్రంలో రూ.200కోట్లతో విగ్రహ నిర్మాణం, ఆడిటోరియం, లైబ్రరీ వంటి హంగులు పూర్తి చేస్తే ఏపీలో అవే పనులకు రూ.400కోట్లు ఎలా అవుతున్నాయనే లెక్కలు మాత్రం బయటపెట్టడం లేదు. అంచనాలు భారీగా పెరిగినా విగ్రహ నిర్మాణం మాత్రం ఎప్పటికి పూర్తవుతుందనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎన్నికల నాటికి విగ్రహాన్ని రెడీ చేయాలని మాత్రం భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Posts