YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దూకుడు పెంచుతున్న గులాబీ పార్టీ

దూకుడు పెంచుతున్న గులాబీ పార్టీ

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో  గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచుతోంది. ఓట్లు, సీట్లే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ‘ఆపరేషన్‌ పాలమూరు’కు శ్రీకారం చుట్టుంది. దేశంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా పాలమూరు ప్రాంతానికి పేరుంది. అభివృద్ధిలో వెనుకబడడంతో ఇక్కడి ప్రజలు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు ఎక్కువగా వలస వెళ్తుంటారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు పనుల కోసం ముంబై, పూణెలతో పాటు ఇతర ప్రాంతాలకు నిత్యం వందల సంఖ్యలో వెళ్తుండడం సర్వసాధారణం. తలాఫున కృష్ణమ్మ పారుతున్న జిల్లాకు అనుకున్న స్థాయిలో ఉపయోగపడడం లేదు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాకపోవడంతో భూములన్నీ బీళ్లుగా మారిపోయేవి. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ పార్టీ... గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే చర్యలకు శ్రీకారం చుట్టింది.మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేలా భారీ కసరత్తు చేస్తోంది అభ్యర్థులను గెలుచుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. అందుకు అనుగుణంగా త్వరలో రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి విపక్షాలను మరింత బలహీనం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత సంస్థాగతంగా టీఆర్‌ఎస్‌ లోపాలపై పార్టీ ముఖ్యనేతలు దృష్టి కేంద్రీకరించారు.నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తూనే.. తాజాగా రైతు సమన్వయ సమితుల పేరిట పలువురికి పదవులు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలు ఉన్న పాలమూరులో ఆధిక్యం కనబర్చాలని అన్ని రాజకీయపార్టీలు తహతహలాడుతున్నాయి. జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుపొందిన పార్టీలు అధికారం దక్కించుకోవడం ఖాయమనే సెంటిమెంట్‌ ఎప్పటి నుంచో ఉంది. అందుకోసం పాలమూరు సెంటిమెంట్‌ను ఆసరా చేసుకుని ప్రధాన పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలు చేస్తుంటాయి. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గులాబీ జెండా ఎగరవేయాలని కృతనిశ్చయంతో ఉన్న టీఆర్‌ఎస్‌ నేతలు అందుకు అనుగుణంగా కసరత్తు చేపట్టారు.అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలా ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగా వీలు చిక్కినప్పుడల్లా ముఖ్యనేతల బహిరంగసభలు, సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. కీలక శాఖల మంత్రులు ఎక్కువగా పాలమూరు ప్రాంతంలోనే అధికారిక పర్యటనలు చేస్తుండడం ఇక్కడ ప్రస్తావనార్హం. తద్వారా గత ప్రభుత్వాల తప్పిదాలను ఎండగడుతూ, ప్రస్తుత అభివృద్ధిని వివరిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. సంస్థాగతంగా నిర్మాణం లేకపోయినప్పటికీ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానంతో పాటు షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్‌ స్థానాలను కైవసం చేసుకొంది. తద్వారా టీఆర్‌ఎస్‌కు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ను సులువుగా సాధించుకుంది. అలాగే వచ్చే ఎన్నికల్లో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలను గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.సీఎం కేసీఆర్‌ ఆదేశాల మే రకు నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై నిత్యం పర్యవేక్షిస్తూ పనులను వేగవంతం చేశారు. ఫలితంగా మూడేళ్లలో ఆ ఫలాలు ప్రజలకు చేరువయ్యాయి. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో బీడుభూములు విస్తృతం గా సాగులోకి తీసుకొచ్చారు. మూడేళ్ల క్రితం జిల్లాలో లక్షన్నర ఎకరాలకు మాత్రమే సాగునీరు అందగా.. తాజాగా 6లక్షల పైచిలుకు భూమి సాగులోకి వచ్చింది. అదే విధంగా రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటగా అతిపెద్ద ప్రాజెక్టు పాలమూరు–రంగారెడ్డిని చేపట్టారు. దీనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతంలో 14లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు పూర్తి కావొస్తున్నా సంస్థాగతంగా పార్టీ ఇం కా బలహీనంగానే ఉందనే విమర్శలున్నాయి. పార్టీకి ఒక నిర్మాణం, కమిటీలు వంటివేమీ లేకపోవడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నా యి. అంతేకాదు బంగారు తెలంగాణ పేరుతో ఇతర పార్టీలకు చెందిన నేతలను భారీగా పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా బలోపేతం కాకపోతే వచ్చే ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగే ప్రమాదముందని పార్టీ ముఖ్యులు భావించారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే కొందరు ముఖ్య నేతలకు మార్కెట్‌ కమిటీ, గ్రంథాలయ సంస్థల పదవులు అప్పగించారు.

Related Posts