చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ రాగి యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసన చేపట్టారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరుపగా 13 మంది చనిపోయారు, 70 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎన్.వెంకటేసన్, ఎస్పీ పీ.మహేంద్రన్ ఫై ప్రభుత్వం బదిలీ వెట్టు వేసింది. తూత్తుకుడి జిల్లా కొత్త కలెక్టర్ గా తెలుగు వ్యక్తి నండూరి సందీప్ నియమితులయ్యారు. గురువారం అయన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.