YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సిమ్లా టూ బెంగళూరు టార్గెట్ 2024

సిమ్లా టూ బెంగళూరు టార్గెట్ 2024

న్యూఢిల్లీ, జూన్ 30, 
టార్గెట్‌ 2024గామరోసారి కలిసేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా మరోసారి కలిసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముందు అనుకున్నట్లుగా సిమ్లా కాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో పెట్టేందుకు ప్లాన్ చేశారు. మోదీకి వ్యతిరేకంగా ప్రధాన ఎజెండాగా విపక్షాలు రెండోసారి కలుస్తున్నాయి. ఈ భేటీలో 17కుపైగా పార్టీలు పాల్గొన్ననున్నాయి. ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా విపక్ష నేతలంతా గళం విప్పుతున్నారు. తమ పార్టీ సిద్దాంతాలు వేరైనా బీజేపీని ఓడించడమే ప్రస్తుతమున్న ఏకైక లక్ష్యమని అంటున్నారు. విపక్షాల ఐక్యత తదుపరి సమావేశం ఇప్పుడు బెంగళూరులో జూలై 13-14 తేదీల్లో జరగనుంది. ఈ విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్  ప్రకటించారు. ముందుగా ఈ సమావేశం జూలై 10-12 తేదీల్లో సిమ్లాలో జరగాల్సి ఉంది. పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో జూన్ 23న జరిగిన సమావేశాన్ని పవార్ ప్రస్తావిస్తూ.. పాట్నాలో విపక్షాల సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళనకు గురయ్యారని ప్రకటిచారు.బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఈ సమావేశంలో 15 ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నాయి. ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు సంఘీభావం తెలిపాయి. ఈ క్రమంలోనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్లాన్ చేశాయి.ఈ సమావేశం తర్వాత, వచ్చే నెల అంటే జూలైలో సిమ్లాలో విపక్షాల ఐక్యత తదుపరి సమావేశం జరుగుతుందని ముందే ప్రకటించాయి. కానీ ఇప్పుడు అంతా కలుసుకునే స్థలం మాత్రం మారింది. ఇప్పుడు ఈ సమావేశం సిమ్లాలో కాకుండా బెంగళూరులో జరుగుతుందని తాజాగా పవార్ ప్రకటించారుసమావేశానంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ నేతలందరితో మంచి సమావేశం జరిగిందని అన్నారు. విపక్షాలన్నీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు.విపక్షాల ఐక్య సమావేశం అనంతరం ఆర్డినెన్స్ విషయంలో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ హాజరయ్యే సభలో మేం ఉండబోమని ఆప్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. మరోవైపు విపక్షాల ఐక్యవేదికపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. వీరిది స్వార్థ కూటమి అని మండిపడ్డారు. విపక్ష పార్టీలకు ఎవరి ఆలోచన వారికి ఉందని విమర్శించింది.

Related Posts