విజయవాడ
పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెలంపల్లి ఘాటుగా విమర్శలు చేసారు. ఉభయ గోదావరి జిల్లాలలో వైసిపి పార్టీ గెలిస్తే పవన్ కళ్యాణ్ పార్టీ మూసేసుకొని వెళ్తావా. నా సవాల్ నీ స్వీకరించే దమ్ము పవన్ కళ్యాణ్ కి ఉందా. ఎమ్మెల్యే కాదు కదా అసెంబ్లీ గేటు కూడా దాటే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదు. పవన్ కళ్యాణ్ పగటి కలలు మానుకోవాలి. పవన్ కళ్యాణ్ నువ్వు ఒక చిరంజీవి తమ్ముడుగా ఒక గుర్తింపు తెచ్చుకుని బతుకు ఇదే నా హెచ్చరిక. ప్రజలకు మంచి చేసే జగనన్న పై దుమారం లేపితే సహించేది లేదని అన్నారు.