YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టిటిడి డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

 టిటిడి డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో  ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

టిటిడిలోని డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో 2018-19వ విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. విద్యార్థులు  అడ్మిషన్.తిరుమల.ఓఆర్జీ వెబ్‌సైట్‌ను సంప్రదించి ఆయా కళాశాలల్లోని కోర్సుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 టిటిడిలో డిగ్రీ స్థాయి కోర్సులకు గాను ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాల, ఎస్వీ ఓరియంటల్‌ కళాశాల, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ఎస్వీ జూనియర్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు జూనియర్‌ కళాశాల ఉన్నాయి. టిటిడి డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశానికి మే 27వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 30న మెరిట్‌ జాబితాను ప్రకటిస్తారు. జూన్‌ 4 నుంచి 9వ తేదీ వరకు డిగ్రీలో ప్రవేశాలకు ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలలో, ఇంటర్‌లో ప్రవేశాలకు ఎస్‌వి ఆర్ట్స్‌ కళాశాలలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 11 నుండి ఇంటర్‌ విద్యార్థులకు, జూన్‌ 12వ తేదీ నుండి డిగ్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి.

Related Posts