YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బాలికలకు 16 ఏళ్ల నుంచేశృంగారం

బాలికలకు 16 ఏళ్ల నుంచేశృంగారం

భోపాల్, జూలై 3, 
మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సామాజిక మాధ్యమాల యుగంలో బాలబాలికలకు 14 ఏళ్లకే యుక్త వయసు వస్తుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బాలికలకు శృంగారానికి సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో బాలురను చట్టపరమైన చర్యల నుంచి కాపాడొచ్చని తెలిపింది. అయితే 2020లో ఓ బాలికను పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడంటూ ఓ యువకుడిపై గతంలో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ ధర్మాసనం జూన్ 27 న ఈ కేసును కొట్టివేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆ బాలిక ఓ వ్యక్తి వద్ద ట్యూషన్ చెప్పించుకునేది. అతను ఓ రోజు మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తనను అత్యాచారం చేసి వీడియో కూడా తీశాడని ఆ బాలిక తెలిపింది. అలాగే దాన్ని చూపించి బెదిరిస్తూ తనను లొంగదీసుకున్నాడని ఆరోపించింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ బాలికకు మరో సన్నిహిత బంధువుతో కూడా శారీరక సంబంధం ఉన్నట్లు హైకోర్టు తెలిపింది. ఇంటర్నెట్ వల్ల బాలబాలికలకు 14 ఏళ్లకే పెద్దరికం వస్తోందని.. హైకోర్టు న్యాయమూర్తి దీపక్ కుమార్ అగర్వాల్ తెలిపారు. తక్కువ వయసులోనే బాలబాలికలు శారీరక ఆకర్షణలకు గరువుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇద్దరి తప్పు ఉన్నప్పటికీ బాలురు మాత్రమే నేరాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలికలకు శృంగారానికి సమ్మతి తెలిపే వయసును తగ్గించడం వల్ల బాలురను కాపడవచ్చని స్పష్టం చేశారు.

Related Posts