YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతిపై రాహుల్ కీలక నిర్ణయం - రంగంలోకి ప్రియాంక

అమరావతిపై రాహుల్ కీలక నిర్ణయం - రంగంలోకి ప్రియాంక

విజయవాడ, జూలై 3, 
ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం కీలక అడుగులు వేస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నామని ఇప్పటికే స్పష్టం చేసిన కాంగ్రెస్ నాయకత్వం..ఇప్పుడు అదే అంశంతో ఏపీ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలని భావిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కార్మికులకు మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. దీనికి తాజాగా పార్టీ ముఖ్య నేతలకు రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేయనున్నారు. తమ కార్యాచరణ ఖరారు చేసారు. తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన ఖమ్మం సభలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఢిల్లీ తిరుగు ప్రయాణంలో గన్నవరంలో కొంత సేపు చర్చించారు. గన్నవరం విమానాశ్రయంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఏపీ రాజకీయాల పైన చర్చించారు. విశాఖ స్టీల్ ట్ విషయంలో రాహుల్ మరోసారి పార్టీ విధానం స్పష్టం చేసారు. అమరావతి ఏకైక రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. త్వరలో ప్రియాంక అమరావతిలో పర్యటిస్తారని..భూములిచ్చిన రైతులకు మద్దతుగా నిలుస్తారని రాహుల్ వెల్లడించారు. ఏపీకి రాజధాని లేకపోవటం బాధాకరమని వ్యాఖ్యానించారుఅమరావతిలో ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న నిర్ణయాలను పార్టీ నేతలకు రాహుల్ కు వివరించారు. విభజన చట్టంలోని హామీల అమలు..పోలవరం ప్రాజెక్టు పనులు..రాజధాని నిర్మాణం..ప్రత్యేక హోదా వంటి అంశాల్లో ఏపీకి అన్యాయం జరుగుతోందని పార్టీ నేతలకు రాహుల్ ను నివేదిక రూపంలో అందచేసారు. కేంద్రంలోకి అధికారంలోకి రాగానే ప్రతీ ఒక్క హామీని నెరవేర్చి ఏపీకి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని రాహుల్ గాంధీ వారికి భరోసా ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటానికి కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసారు. ఇదే సమావేశంలో కేంద్రంలోని అధికార బీజేపీతో ఏపీలోని రాజకీయ పార్టీల సంబంధాల పైనా రాహుల్ పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. విశాఖ సభలో రాహుల్:రాష్ట్రంలో వైసీపీ..తెలుగుదేశం..జనసేన పార్టీలు ఏం చేస్తున్నాయి..ఆ పార్టీల పైన ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనే కోణంలో పార్టీ నేతలను రాహుల్ ఆరా తీసారు. ఈ మూడు పార్టీలు బీజేపీతో కలిసే ఉన్నాయని..రాష్ట్రంలో మాత్రం గందరగోళంగా వ్యవహరిస్తున్నాయని పార్టీ నేతలు రాహుల్ కు వివరించారు.ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే నెలలో విశాఖ సభలో పాల్గొటానని రాహుల్ వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేసారు. పార్టీ పరంగా కార్యక్రమాలు రాష్ట్రంలో వేగవంతం చేయాలని రాహుల్ ఏపీ నేతలకు నిర్దేశించారు.

Related Posts