YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీఆర్ఎస్ లో అసంతృప్తులు గళం

బీఆర్ఎస్ లో అసంతృప్తులు గళం

హైదరాబాద్, జూన్ 3, 
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్ లో అసంతృప్తులు గళం వినిపిస్తున్నారు. తాజాగా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత సామేల్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు రేసు గుర్రాలపై ఫోకస్ పెట్టాయి. ముందుగానే 70 నుంచి 80 మంది అభ్యర్థులను కూడా ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో...పలువురు నేతలు అలర్ట్ అవుతున్నారు. సీటుపై తేడా కొడితే చాలు...హైకమాండ్ కు హింట్ ఇచ్చేస్తున్నారు. ఇక అధికార బీఆర్ఎస్ లో చూస్తే...ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ఇప్పటికే పొంగులేటి, జూపల్లితో పాటు పలువురు నేతలు కారు దిగగా... మరికొందరు కూడా అదే బాటలో వెళ్లేందుకు యోచిస్తున్నారు. ఇప్పటికే తీగల వంటి నేతలు హైకమాండ్ అల్టిమేటం ఇవ్వగా... సూర్యాపేట జిల్లాకు చెందిన సీనియర్ నేత సామేల్ పార్టీని వీడనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందిసూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్, గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ మందుల సామేల్ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... బీఆర్ఎస్ లో మాదిగలకు తీవ్రని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కనీసం మాదిగ సామాజికవర్గానికి చెందిన ఒక్కరు కూడా మంత్రిగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల సమస్యలు చెప్పుకునే అవకాశం లేదన్నారు. మాదిగలు మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా మాదిగలకు గుర్తింపు లేదన్నారు. ఎవరు జెండా మోయని నాడు తాను జెండా మోసి పార్టీని నిలబెట్టానని చెప్పుకొచ్చారు. తుంగతుర్తిలో తనకు పోటీగా వలస మాలను నిలబెట్టారని ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ప్రగతి నివేదన సభ వేదికగా... తుంగతుర్తి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ను మూడో సారి గెలిపించాలని కోరారు. ఫలితంగా తుంగతుర్తి టికెట్ గాదరి కిషోర్‌కే అనే విషయాన్ని పరోక్షంగా చెప్పినట్లు అయింది. ఇది కాస్త సామేల్ కు మింగుడు పడటం లేదు. 2014, 2018లో టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన...ఈసారి వస్తుందని భావించారు. కేటీఆర్ ప్రకటనతో ఈ సారి కూడా తుంగతుర్తి టికెట్ తనకు దక్కేలా లేదని భావించాడు. అందుకే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి వేరి పార్టీ టికెట్‌పై బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారా లేదా బీఎస్పీలోకి వెళ్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది.

Related Posts