YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

9 వేలకు చేరిన పసుపు ధర

9 వేలకు చేరిన పసుపు ధర

నిజామాబాద్, జూన్ 3, 
గత సీజన్ లో కురిసిన భారీ వర్షాలకు పసుపు రైతులకు సరైన ధర, దిగుబడి లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. కాగా, పసుపునకు ఇప్పుడిప్పుడే మంచి ధర పలుకుతోంది. గత వారం నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ధర రూ.9,269 రూపాయలు పలికింది. స్పైస్ బోర్డ్ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో ఈ సీజన్ లో ధర తక్కువగా కారణంగా రైతులు కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ చేసుకున్నారు.ఇప్పుడిప్పుడే పసుపు ధరలు కొంత మేరకు ఆశాజనకంగా ఉండడంతో రైతులు పసుపు కొమ్ములు అమ్మేందుకు మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్నారు. ఏర్గట్ల మండలం దోంచందా, జగిత్యాల జిల్లాలో ఇబ్రహీంపట్నంకు చెందిన రైతుల పసుపునకు రూ.9,200 నుంచి రూ.9,300 వరకు ధర పలికింది. దీంతో కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకొని ఇప్పుడు అమ్ముకున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అటు వ్యాపారస్తులు కూడా ప్రస్తుతం రేట్లు ఆశాజనకంగా ఉన్నాయని, మేలైన పసుపు ఉంటే రూ.10వేల ధరకు కూడా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు. శుక్రవారం మోడల్ ధర రూ.6,605 ఉండగా తక్కువగా రూ.4,600కు అమ్ముడుపోయిన పసుపు అత్యధికంగా రూ.9,599 విక్రయించినట్లు వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు తెలిపారు. శుక్రవారం కాడి రకం 1,855 క్వింటాళ్ల పసుపు మార్కెట్ కు వచ్చిందని తెలిపారు. గోల రకం 839 క్వింటాళ్లు రాగా దాని మోడల్ ధర రూ.6,400గా నిర్ణయించారు.అత్యల్పంగా రూ.5 వేలకు, అత్యధికంగా రూ.7,939కి విక్రయించినట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత నిలువ ఉన్న రకానికి మంచి ధర వస్తుందని ఈ సీజన్ లో ఇదే అత్యధిక ధర అని అధికారులు తెలిపారు. రైతులు మంచి ధర కోసం ఎదురు చూసి అన్ సీజన్ లో అమ్ముకుంటున్న వారికి కాసుల వర్షం కురుస్తుందనే చెప్పాలి.

Related Posts