కాకినాడ, జూలై 4,
రుచిలో రారాజు పండుగప్ప అని తెలిసిందే. అలాంటిది గోదావరిలో అరుదుగా లభించే వాటిలో ఓ భారీ పండుగప్ప చేప దొరికింది. యానాం మత్స్యకారుల గాలానికి ఈ భారీ పండుగొప్ప చిక్కింది. ఈ మద్య కాలంలో ఇంత భారీచేప దొరకడం అరుదు అంటూ, తమకు భారీ పండుగొప్ప దొరకండంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సముద్ర చేపల రుచులులో ఈ పండుగొప్ప చేప రుచి కూడా గొప్పగా ఉంటుంది. యానాం దగ్గర గోదావరిలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా వారి గాలానికి 15 కేజీల భారీ పండుగొప్ప చేప చిక్కింది. పులస చేప అంత కాకపోయినా, సాధారణ చేపలతో పోల్చితే పండుగప్ప చేప ధర కొంచెం అధికంగా ఉంటుంది. ఈ భారీ పండుగప్ప చేపను పొన్నమండ భద్రం, రత్నం దంపతులు వేలంలో దక్కించుకున్నారు. ఈ జంట రూ.9000 చెల్లించి పండుగప్పను మత్స్యకారుల నుంచి సొంతం చేసుకుంది. పండుగప్ప బాగా రుచి ఉంటాయని, అయితే గోదావరిలో ఇంత భారీ పండుగప్ప దొరకడం చాలా అరుదుగా జరుగుతుందని గంగ పుత్రులు చెబుతున్నారు. సముద్రం ఉప్పు నీటితోపాటు మంచినీటి నదులలో కూడా ఇది పెరుగుతుంది. ఈ పండుగప్ప చేప ఆహారంగా మాంసాహారం మాత్రమే తింటుందని తెలిపారు. పండుగప్ప చేపను పులుసుగా ఇగురుగానే కాకుండా ఫ్రై చేయడంతో పాటు తట్టంగా (ఉప్పుచేపగా) కూడా మాంస ప్రియులు ఆహారంగా తీసుకుంటారు. రుచిలో పులస చేపలతో పోటీ పడే ఈ పండగప్ప భారీచేపను చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చారు. పులస చేపలు అయితే రికార్డు ధరలు పలుకుతాయి. వాటి తరువాత అధిక ధర పలికే చేపల్లో గండుగప్ప రకం ఒకటి. గతంలో ఉప్పాడ చేపల చెరువులో చిక్కిన 10 కేజీల పండుగప్ప రూ.4 వేలు ధర పలికడం తెలిపిందే. పండుగప్ప అనేది ఒక రకమైన చేప జాతి. పండుగప్ప లేక ఆసియా సీబాస్ లేక బర్రముండి చేపలు గుడ్లు పెట్టేందుకు నీటి అడుగు భాగానికి వెళుతుంటాయి. ఇది చాలా రుచి గా వుంటుంది.
పండుగప్పలలో ముఖ్యమైన రకాలు ఇవీ..
- మంచినీటి పండుగప్పలు
- ఉప్పునీటి పండుగప్పలు
- నల్ల పండుగప్పలు
- తెల్ల పండుగప్పలు
- మచ్చల పండుగప్పలు
- ఎర్ర పండుగప్పలు