గుంటూరు, జూలై 4,
ఏపీ రాజకీయాల్లో టీడీప దూకుడు పెంచింది. భవిష్యత్తుకు గ్యారంటీ పేరు టీడీపీ నేతలు బస్సు యాత్రలు ప్రారంభించారు. మూడు జోన్ లలో ఐదు బస్సుల్లో టీడీపీ యాత్ర కొనసాగునుంది.
టీడీపీ చేపట్టిన 'భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్ర'లో భాగంగా ఆదివారం జోన్-2లోని కాకినాడ పార్లమెంట్‍లోని జగ్గంపేట మోడల్ డిగ్రీ కాలేజీ నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. జోన్-3 గుంటూరు పార్లమెంట్‍లోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో గోరంట్ల (అమరావతి హైవే) నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. జోన్-4 చిత్తూరు పార్లమెంట్‍లోని నగరి నియోజకవర్గం నగరిలోని ఓం శక్తి టెంపుల్ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. జోన్-5 అనంతపురం పార్లమెంట్‍లోని శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ నేతలు 'భవిష్యత్తుకు గ్యారంటీ' పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు.ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఇప్పటికే దూకుడు పెంచింది. రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్ అయ్యేందుకు కసరత్తు చేస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మరో వైపున భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నేతలు బస్సు యాత్ర చేపట్టారు. మూడు జోన్‌లుగా విభజించి ఐదు బస్సుల్లో టీడీపీ యాత్ర సాగుతోంది. గత కొద్ది రోజులుగా అధినేత చంద్రబాబు కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో వరుస భేటీలు అవుతున్నారు. చంద్రబాబు నేతలతో టెలి కాన్ఫరెన్స్‌లను కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ .. పార్టీ తరపున రియాక్ట్ అయ్యే విధానంపై చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వీటితోపాటు నెలలో ఒకట్రెండు సార్లు జిల్లాల పర్యటనకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.టీడీపీ మహానాడులో ప్రకటించిన హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారం నుంచి భవిష్యత్ కు గ్యారెంటీ పై జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలకు ప్రణాళికలు రూపొందించారు. ‘ఇదేం ఖర్మ కార్యక్రమం’ కింద ఆయన రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. 13 లోక్‌సభ స్థానాల్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయన చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, టీడీపీ మేనిఫెస్టో హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరో విడత పర్యటనలకు ఆయన ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. జులై రెండో వారం నుంచి ఆయన పర్యటనలు ప్రారంభం కావచ్చని తెలుగు దేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.