జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో నిరాహార దీక్షకు దిగనున్నారు. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్ధానం కిడ్నీ బాధితులతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం తన డిమాండ్‌పై పట్టించుకోకపోవడంతో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు శ్రీకాకుళంలో తాను బస చేస్తోన్న రిసార్టులోనే పవన్ నిరాహార దీక్ష చేస్తారని, రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్యే పవన్ నిరాహార దీక్ష ఉంటుందని జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలియజేసారు.