YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గ్రామీణ ప్రాంతంలో పుట్టి భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన అమ్మాయి

గ్రామీణ ప్రాంతంలో పుట్టి భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన అమ్మాయి

అనంతపురం, జూలై 5, 
మనదేశంలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే రెప్ప వాల్చకుండా క్రికెట్ మ్యాచ్‌లు చూడటంలో మునిగిపోతారు క్రికెట్ అభిమానులు. అయితే ఎవరైన క్రికెటర్ కావాలనుకుంటే మాత్రం ఆ స్థాయికి వెళ్లడం మాములు విషయం కాదు. క్రికెటర్ అవ్వాలని చాలామంది యువకులు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అందులో కొందరికి మాత్రమే అవకాశాలు వస్తాయి. ఇక కొంతమంది అమ్మాయిలు కూడా భారత జట్టులో చోటు సంపాదించుకునేందుకు శ్రమిస్తారు. కానీ ఓ క్రికెటర్ కావాలంటే మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఓ క్రికెటర్ అవ్వాలంటే వారు బాగా డబ్బున్నవారై ఉండాలి. ఇలాంటి వారికే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందుకే చాలా మంది భారత జట్టుకి ఎంపిక కావడం చాలా కష్టమైన విషయం అని చెబుతారు. అయితే గ్రామీణ ప్రాంతంలో పుట్టి తాటి మట్టలతో చిన్నప్పుడు క్రికెట్ ఆడిన ఓ అమ్మాయి ఏకంగా భారత మహిళల సీనియర్ జట్టుకు ఎంపిక అయ్యింది. ఆమె పేరే అనుష. చిన్నప్పుడు తాటిమట్టలతో క్రికెట్ ఆడిన ఈ అమ్మాయి నేడు అంతర్జాతీయ క్రికెటర్‌గా అరంగేట్రం చేసింది. వివరాల్లోకి వెళ్తే అనుష స్వస్థలం అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామం. ఈమె తల్లిదండ్రులు మల్లిరెడ్డి, లక్ష్మీదేవి. తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అనుషకు చిన్నప్పటి నుంచే క్రికెట్ ఆటపై ఆసక్తి ఉండేది.మారుమూల గ్రామంలో పుట్టిన ఈమెకు సరైన వసతులు లేనప్పటికీ కూడా తన తల్లిదండ్రులు కోచ్‌ల సహాయంతో క్రికెట్ నేర్చుకుంది. అనంతపురం ఆర్డీటీలో క్రికెట్ శిక్షణ తీసుకుంది పట్టుదలతో కృషి చేసి జిల్లాస్థాయి క్రికెట్‌లో తన సత్తా చాటింది. స్పిన్ బౌలింగ్, బ్యాటింగ్‌లో మెరిపిస్తూ సెలక్టర్ల దృష్టిలో పడింది.చివరికి భారత మహిళల సీనియర్ జట్టుకు ఎంపిక అయ్యింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్ కు అనంతపురం రైతు బిడ్డ ఎంపిక కావడం పట్ల ఆమె తల్లిదండ్రులు, జిల్లా వాసులు‌, క్రికెట్ కోచ్‎లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.2019లో వచ్చిన “కౌసల్యకృష్ణమూర్తి” సినిమాలో.. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గ్రామీణ ప్రాంతం నుంచి క్రికెటర్ అయినట్లు.. అనూష కూడా అంతర్జాతీయ క్రికెట్ లో ఆడేందుకు ఎంపిక కావడం చాలా గొప్ప విషయం. జులై 9న బంగ్లాదేశ్‎తో జరిగే 3వన్డేలు, 3 టీ20 మ్యాచ్‎లలో ఆడనుంది అనూష. ఇక జులై 6న మహిళా జట్టుతో కలిసి ఆమె బంగ్లాదేశ్‌కు పయనం కానుంది.

Related Posts