విజయవాడ
రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ పథకాల ప్రచార కార్యక్రమం 'హర్ దిల్ మే వైఎస్ఆర్' కార్యక్రమంలో భాగంగా జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మెన్ షేక్ గౌస్ మొహిద్దిన్ బుధవారం విజయవాడ, ఫోర్మెన్ బంగ్లా ఎఱ్ఱకట్ట వద్ద గల అక్బరీ మసీదు వద్ద స్థానిక ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గౌస్ మొహిద్దిన్ మాట్లాడుతూ మసీదు ఇమామ్,మౌసన్ల జీతాలు,షాదీ తోఫా,నవరత్నాల పథకాలలో భాగంగా కోట్లాది రూపాయల లబ్ది వంటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తూనే,మరో పక్క మైనారిటీలకు భద్రతకు ముప్పుగా పరిణమించిన ఎన్ సి ఆర్ లాంటి చట్టాలు వచ్చినప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం తక్షణం స్పందించి ఆ చట్టం అమలుకు నిరాకరించడమే కాకుండా ఎన్ సి ఆర్ కి వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి,దాన్ని ఆమోదింపచేసి కేంద్రానికి పంపించారని గుర్తు చేసారు.మైనారిటీ వర్గాల ప్రయోజనాలను కాపాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పాలనకు,పేదల పక్షాన నిలబడి పెత్తందార్లతో పోరాటం చేస్తున్న సంక్షేమ రథసారధి జగనన్న కు అందరూ అండగా నిలవాలని కోరారు.మైనారిటీల పక్షపాతి స్థానిక శాసనసభ్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారికి మద్దతు తెలపాలని కోరారు.సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు చేసిన మేలును గణాంకాలతో వివరించారు.సంక్షేమ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ సీరంశెట్టి పూర్ణచంద్రరావు మైనారిటీ నాయకులు షేక్ సలీం,సుభాని ఖాన్,షేక్ బడేమియా,షేక్ బాజి షహీద్,అన్సారీ బేగ్,షేక్ రసూల్,చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.