YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓ వైపు అంతర్గత పోరు.. మరోవైపు అధిష్టానం ఆదేశాలు

ఓ వైపు అంతర్గత పోరు.. మరోవైపు అధిష్టానం ఆదేశాలు

హైదరాబాద్, జూలై 5, 
తెలంగాణ బీజేపీ.. ఓ వైపు అంతర్గత పోరు.. మరోవైపు అధిష్టానం ఆదేశాలు.. ఎన్నికలకు సమాయత్తం.. మార్పు మొదలుకాబోతోంది.. ఇలా ఎన్నో చర్చలు.. మరెన్నో ప్రచారాలు.. ఈ తరుణంలోనే తెలంగాణ బీజేపీ నాయకత్వ మార్పు విషయంలో.. అంతా అనుకున్నట్లే జరిగింది.. అధిష్టానం నాయకత్వ మార్పుకే పచ్చజెండా ఊపింది.. వరుసగా కీలక నాయకులతో భేటీ అయిన అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది. అంతేకాకుండా ఈటల రాజేందర్ కు కూడా కీలక పదవిని ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అయితే, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇంకా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, బండి సంజయ్ నాయకత్వంలోనే.. ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన బీజేపీ హైకమాండ్.. ఆయన్ను కాదని.. కిషన్ రెడ్డికి అప్పగించడం పట్ల కొందరు.. ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేసిన సందర్భంగా ఆయనకు మద్దతుగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నల్లగొండ పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వర్ రావు ప్రకటన విడుదల చేశారు. పార్టీ కోసం బండి సంజయ్ తన ప్రాణాన్ని, కుటుంబాన్ని పక్కన పెట్టి మరి.. రాష్ట్రంలో బలమైన ప్రత్యర్థిగా నిలిపారని.. అందరికీ ధైర్యాన్ని నింపిన బండి సంజయ్.. ఇప్పుడు రాజీనామా చేయడంతో పార్టీ గురించి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. ఆయన రాజీనామాకు నిరసనగా తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Related Posts