YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీకి మరో షాక్ తప్పదా

బీజేపీకి మరో షాక్ తప్పదా

నల్గోండ, జూలై 5,
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ నేత పొంగులేటితో భేటీ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేందుకు రాజగోపాల్ రెడ్డి, ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. కోమటిరెడ్డి స్థానంలో కాంగ్రెస్ లో అలానే ఉందని, పార్టీలోకి తిరిగి వచ్చేందుకు తాను ఒక మెట్టు దిగుతానని రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని ఆహ్వానించారు. ఈ పరిణామాల మధ్య రాజగోపాల్ రెడ్డి పొంగులేటితో భేటీ అవ్వడం చర్చకు దారితీసింది.
బీజేపీపై కోమటిరెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల దిల్లీ వెళ్లిన ఆయన...బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ను ఓడించాలంటే మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అధిష్ఠానానికి చెప్పామన్నారు.కాంగ్రెస్‌నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై వీరువురూ చర్చించినట్టు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో పొంగులేటితో కోమటిరెడ్డి భేటీ చర్చనీయాంశం అయింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం...తెలంగాణ రాజకీయాలను మార్చేసింది. అప్పటి వరకూ బీజేపీ వైపు మొగ్గుచూపిన నేతలు... కర్ణాటకలో బీజేపీ ఓటమితో కాంగ్రెస్ లోకి క్యూకట్టారు. ఇటీవలె పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూపల్లి కూడా హస్తం పార్టీలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారు.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...మునుగోడు ఉపఎన్నికలో ఓటమిపాలైయ్యారు. గత కొద్ది రోజులుగా బీజేపీపై అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి... పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం. తాజాగా ఆయన పొంగులేటిని కలవడంతో ఆ ప్రచారానికి మరింత బలాన్నిచ్చినట్లయింది. కోమటిరెడ్డి పార్టీ మార్పుపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సోదరుడైన రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరితే నల్గొండలో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డితో విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తే బీఆర్ఎస్ కు నల్గొండలో ఎదురుగాలి తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Related Posts